ఆంధ్ర ఐపిఎస్ సస్పెండ్
By: Mohammad Imran
On
ఐపీఎస్ అధికారి సస్పెన్షన్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి ఒకరిని సస్పెండ్ చేసింది. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సునీల్ కుమార్ పై వచ్చిన ఆరోపణలు, అభియోగాలపై విచారణ జరిపిన అనంతరం ప్రభుత్వం ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం ద్వారా సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించారనేది సునీల్ కుమార్ పై గల ఆరోపణలు. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా నేతృత్వంలో ప్రభుత్వం విచారణ నిర్వహించింది. అదనపు డీజీ హోదాలో గల ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన ఘటన అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Tags: