మావొయిస్ట్ పార్టీ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండర్ లొంగుబాటు
By: Mohammad Imran
On
*మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడి ప్రోటెక్షన్ గ్రూప్ కమాండర్ లొంగుబాటు*
చురకలు విలేఖరి
వరంగల్
*నిషేదిత సిపిఐ మావోయిస్టు పార్టీ గొత్తికొయ ఏరియా కమిటీ సభ్యురాలు, కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారయణ రెడ్డి ఆలియాస్ కొసా ప్రోటెక్షన్ గ్రూప్ కమాండర్ వంజెం కేషా ఆలియాస్ జిన్ని శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట లొంగిపోయింది.*
ఈ లొంగుబాటుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ వివరాలను వెల్లడిస్తూ ఛత్తీస్‌గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా, పామెడ్ మండలం, రాసపల్లి గ్రామానికి చెందిన వంజెం కేషా తండ్రి హిడ్మా కూడా (ప్రస్తుతం ఇతను జైలులోవున్నాడు) మావోయిస్టు పార్టీలో పనిచేసేవాడు. దీనితో కేషా కూడా బాల్యంలో చైతన్య నాట్య మండలి పనిచేయడంతో మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులతో పరిచయాలు కావడంతో 2017లో పామెడ్ లోకల్ స్క్వాడ్ కమాండర్ గొట్టే కమల ద్వారా మావోయిస్టు పార్టీలో చేరిన కేషా రెండు సంవత్సరాలు పాటు పున్నెం జోగ అధ్వర్యంలో చైతన్య నాట్యమండలిలో పనిచేసింది. ఇదే సంవత్సరం కేషాను పార్టీ నాయకత్వం అబుజ్‌మడ్ ప్రాంతానికి బదిలీ చేసి కేంద్ర కమిటీ సభ్యుడు కడారీ సత్యనారయణ రెడ్డికి ప్రోటెక్షన్ గ్రూప్ సభ్యురాలిగా నియమించింది. 2021 సంవత్సరంలో కేంద్ర మవోయిస్టు నాయకత్వం కేషాను ఏరియా కమిటీ సభ్యురాలిగా నియమించడం జరిగింది. 2022 డిసెంబర్ వరకు ప్రోటెక్షన్ గ్రూప్ సభ్యురాలిగా పనిచేసి కేషా మరో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు రమేష్‌ను (ప్రస్తుతం మహరాష్ట్ర జైలులో వున్నాడు) వివాహం చేసుకోని ఉత్తర బస్తర్ డివిజన్లో కొద్ది కాలం పనిచేసింది. అనంతరం 2024 ఎప్రిల్ మాసంలో తిరిగి కంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారయన రెడ్డి ఆలియాస్ కొసా ప్రోటెక్షన్ గ్రూప్ మహిళా కమాండర్ బాధ్యతలు చేపట్టింది.
*పాల్పడిన నేరాల వివరాలు*
పార్టీలో పనిచేసిన సమయంలో కొహిలబేడా పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు పార్టీ సభ్యులతో కల్సి పోలీసులపై కాల్పులు జరపడంతో ఒక పోలీస్ అధికారి మరణించగా మరో పోలీస్ అధికారి తీవ్రంగా గాయబడిన సంఘటనతో పాటు, అబుజ్‌మడ్‌లో ప్రాంతంలో పోలీసులపై జరిపిన కాల్పుల్లో ఒక పోలీస్ అధికారి మరణించాడు. ఈ రెండు సంఘటనల్లో వనజం కేషే నిందితురాలు.
*లొంగుబాటుకు గల కారణాలు*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు అందిస్తున్న పునరావాస పథకాలకు అకర్షితులుకావడంతో పాటు, ప్రధానంగా తాను సురక్షితంగా లొంగుబాటు అయ్యేందుకు పూర్తి సహయ సహకారాలు అందిస్తామని వరంగల్ కమిషనరేట్ పోలీస్ అధికారులు ఇచ్చిన వాగ్దనంతో పాటు ప్రస్తుతం మావోయిస్టు పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత రావడం, ఆరోగ్యం కుడా సహకరించక పోవడంతో కేషా లొంగిపోయిందని. పోలీసుల ఎదుట లొంగిపోయిన వంజెం కేషాపై 4లక్షల రూపాయల ప్రభుత్వ రివార్డు వున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు.

Tags: