తెలంగాణ లో మొదటి స్థానానికి ఏదిగిన గాయత్రి బ్యాంక్

తెలంగాణ లో మొదటి స్థానానికి ఏదిగిన గాయత్రి బ్యాంక్

గాయత్రి బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి. 

తెలంగాణలో మొదటి స్థానానికి ఎదిగిన గాయత్రి బ్యాంకు.

గాయత్రి బ్యాంకు చైర్మన్ ముత్యాల లక్ష్మణ్ రెడ్డి.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 20: గాయత్రి బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని, గాయత్రి బ్యాంకు.
తెలంగాణలో మొదటి స్థానానికి ఎదిగిందని గాయత్రి బ్యాంకు చైర్మన్ ముత్యాల లక్ష్మణ్ రెడ్డి అన్నారు. 
జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండల కేంద్రంలో ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు యొక్క 57 వ శాఖను శుక్రవారం బ్యాంకు చైర్మన్ ముత్యాల లక్ష్మణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బ్యాంకు చైర్మన్, డైరెక్టర్లు, పురప్రముఖులు, సహకార అధికారులు, ముఖ్యకార్యనిర్వహణాధికారి పాల్గొని బ్యాంకు యొక్క వివిధ విభాగాలను ప్రారంభించారు.
అనంతరం జరిగిన సమావేశంలో గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ ముత్యాల లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ 2000 సంవత్సరంలో ప్రారంభించబడిన గాయత్రి బ్యాంకు నిరంతర కృషితో నేడు మల్టీస్టేట్ బ్యాంకుగా రూ. 3062.50 కోట్ల వ్యాపారాన్ని సాధించి తెలంగాణలోని కో-ఆపరేటివ్ బ్యాంకులలో అతి పెద్ద బ్యాంకుగా అవతరించి కో-ఆపరేటివ్ వ్యవస్థలో అగ్రగామిగ పనిచేస్తున్నామని అన్నారు. గొల్లపెల్లి ప్రాంత ప్రజలు బ్యాంకు యొక్క సేవలను వినియోగించుకోని బ్యాంకును ఆదరించాలని కోరారు. సహకార వ్యవస్థలో, కార్పోరేట్ బ్యాంకులకు ధీటుగా పనిచేస్తూ, 24 సంవత్సరాల కాలంలోనే 1741.15 కోట్ల డిపాజిట్లతో, 1321.35 కోట్ల ఋణాలను కలిగి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా 56 బ్రాంచీలతో, 7 లక్షల 62 వేల మంది వినియోగదారులను కలిగి అన్ని విధాలుగా మంచి అభివృద్ధిని సాధించామని అన్నారు. బ్యాంకు యందు మొబైల్ బ్యాంకింగ్, ఎఇపిఎస్, యు.పి.ఐ. ఎ.టి.ఎమ్ సర్వీసులు, ఆర్.టి.జి.ఎస్ వంటి టెక్నాలాజికల్ సేవలతో పాటుగా, నిరక్షరాస్యులకు సహాయకంగా ఉండేందుకు ప్రత్యేక హెల్ప్ డెస్స్ను ఏర్పాటుచేశామని, ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తుందని, ఖాతాదారులకు అవసరమైన ఫోటో మరియు జిరాక్స్లను బ్యాంకు యందే ఉచితంగా అందిస్తూన్నామని తెలియజేశారు.అనంతరం బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ మాట్లాడుతూ బ్యాంకు ముఖ్య ఉద్దేశ్యం సామాన్య మధ్యతరగతి, వర్తక వాణిజ్య వర్గాల ప్రజలకు కార్పోరేట్ బ్యాంకులకు ధీటుగా సేవలందించడమేనని, ఆన్లైన్ సేవలతో పాటుగా ఎటిఎం , ఏఈపీఎస్, యూపీఐ , ఆర్టీజీఎస్/నెఫ్ట్ వంటి అధునాతన సేవలను అందిస్తున్నామని, గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతా ద్వారా 1 లక్ష రూపాయల ప్రమాదభీమా సౌకర్యాన్ని అందిస్తున్నామని, వర్తక, వ్యాపార, ఉద్యోగులకు కావలసిన అన్ని రకాల బ్యాంకింగ్ సేవలను సత్వరంగా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ఇట్టి సేవలను గొల్లపల్లి నగర వాసులు వినియోగించుకొని బ్యాంకును ఆదరించాలని కోరారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరాంతానికి మరో 09 బ్రాంచీలను ప్రారంబించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తద్వారా మొత్తం 66 బ్రాంచీలకు చేరుకుంటామని అన్నారు.
అనంతరం బింగి తిరుపతి ఏజిఎం మాట్లాడుతూ వినియోగదారులు మాపై చూపిస్తున్న ఎనలేని ఆదరాభిమానాల వల్ల బ్యాంకును మరింత అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తామని, నగరవాసులు మరియు పరిసర గ్రామాల ప్రజలు బ్యాంకు యొక్క సేవలను వినియోగించుకొని బ్యాంకును ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం బ్రాంచి హెడ్ నేరెళ్ళ మునీందర్ మాట్లాడుతూ ఆధార్ నంబరు ద్వారా నగదు బదిలీ పథకం క్రింద వచ్చు సబ్సిడీ బదలాయింపులను, ప్రభుత్వ ఆసరా పెన్షన్లను పొందవచ్చని, బంగారు ఆభరణాలపై ఋణాలను అందజేస్తామని రైతులకు వ్యాపారులకు ఆస్థి తనఖాపై ఋణ సౌకర్యం కల్పిస్తామని, వినియోగదారులు బ్యాంకును ఆదరించి ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు, సహకార అధికారులు, బ్యాంకు పాలక వర్గ సభ్యులైన ఎమ్. సౌజన్య, ఎ. రాజిరెడ్డి, ఎ.సత్యం, వై. అశోక్, కె. శ్రీనాథ్, బి. విజయ్, జి.గంగాధర్, వి. మాధవి, ఆర్. సతీష్, ఎస్. రవి కుమార్ లు , మరియు ఇతర సభ్యులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.IMG-20250221-WA0046

Tags:

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.