ఇసుక అక్రమ రవాణా సమర్థవంతంగా అరికట్టాలి. గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఇసుక అక్రమ రవాణా సమర్థవంతంగా అరికట్టాలి.  గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి.  జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

IMG-20250220-WA0051ఇసుక అక్రమ రవాణా సమర్థవంతంగా అరికట్టాలి.

గంజాయి రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి.

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్


చురకలు ప్రతినిధి,జగిత్యాల,  ఫిబ్రవరి 20:  సమర్థవంతమైన పోలీసు వ్యవస్థతోనే శాంతి భద్రతల వ్యవస్థ పటిష్టంగా ఉంటాయని,  సమస్యలను క్షేత్ర స్థాయిలో గుర్తించి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  సూచించారు. గురువారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గత నెలలో జరిగిన నేరాలపై చర్చించి పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.  ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమంగా ఇసుక త్రవ్వకలు, రవాణా చేపట్టే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటు అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని, అధికారులను అదేశించారు. జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో నమోదు అయిన గంజాయి కేసులలో నిందుతులుగా ఉన్న వారి యెక్క కదలికలు గమనిస్తూ స్పెషల్ డ్రైవ్ ,తనిఖీలు నిర్వహించి గంజాయి నిర్ములనకు కృషి చేయాలని ఆదేశించారు. రానున్న శివరాత్రి ,హోలీ, వివిధ జాతర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. నేర నియంత్రణలో బాగంగా సొసైటీ పర్ పబ్లిక్ సేఫ్టీ లో బాగంగా ప్రతి పట్టణంలోని కాలనీల్లో, గ్రామాలలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాల నివారణ కొరకు రోడ్డు భద్రతపై అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు.  ఈ సందర్భంగా ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ యొక్క క్రైమ్ సీన్లో తీసుకోవాల్సిన చర్యల గురించి ఎఫ్ఎస్ఎల్  అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశ్వర్లుచే ఎఫ్ఎస్ఎల్ కు నమూనాలను ఫార్వార్డ్ చేయడం, నేర స్థలంలో (క్రైమ్ సీన్ ) సేకరించిన సాక్ష్యాలను శాస్త్రీయంగా పరిశీలించటం, డీఎన్ఏ, రక్తం, వేలిముద్రలు, రసాయనిక అవశేషాలను పరీక్షించడం, నేరస్థులను గుర్తించడం మరియు నేరానికి సంబంధించిన ఆధారాలను సేకరించడం, విషప్రయోగం (పోయిసోనింగ్), మాదక ద్రవ్య వినియోగం (డ్రగ్  టెస్టింగ్) వంటి కేసుల్లో రసాయన పరీక్షలు చేయడం అనే అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డిఎస్పీలు రఘు చంధర్, రాముల, రంగా రెడ్డి, డీసీఆర్బీ, ఎస్బి,ఐటీ  కోర్ ,సీసీఎస్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, ఆరిఫ్అలీఖాన్, రఫీక్ ఖాన్, శ్రీనివాస్ రిజర్వ్ ఇన్ స్పెక్టర్ లు కిరణ్ కుమార్ ,వేణు, సిఐలు వేణుగోపాల్, రామ్ నరసింహారెడ్డి,రవి, నిరంజన్ రెడ్డి, కృష్ణ రెడ్డి, సురేష్, ఎస్ఐలు,డీసీఆర్బీ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20250220-WA0049

Tags:

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.