నేరాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకం. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ నేర నిరోధక చర్యల్లో జిల్లా పోలీస్ జాగిలాల పనితీరు ప్రశంసనీయం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
నేరాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకం.
జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్
నేర నిరోధక చర్యల్లో జిల్లా పోలీస్ జాగిలాల పనితీరు ప్రశంసనీయం.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 5 : పోలీస్ జగిలాలు (పోలీస్ డాగ్స్ ) నేర పరిశోధన, భద్రతా చర్యలు, మాదకద్రవ్యాల నియంత్రణ, మరియు విపత్తు పరిస్థితుల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయిని, శిక్షణా సామర్థ్యం వల్ల పోలీసులు విభిన్న ఆపరేషన్లలో వీటిని వినియోగిస్తున్నారని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. జిల్లా పోలీస్ పరేడ్ మైదానం దగ్గర పోలీస్ జగిలాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గదులను బుధవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్ జాగిలాలకు ఇంతకు ముందు ఎస్సారెస్పీ క్వార్టర్స్ లో ఉండేదని, అక్కడ సరైన వసతులు లేవని జిల్లా ఎస్పీ తమదృష్టికి తీసుకురావడం జరిగిందని వీటికి శాశ్వతంగా గదులను కేటాయించాలని ఉద్దేశంతో వీటిని ప్రారంభించడం జరిగిందన్నారు. జగిలాలు నేరాల నిరోధం, విచారణ మరియు భద్రతాపరమైన చర్యల్లో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయని, వీటి అధిక సామర్థ్యం, విశ్వసనీయత, ప్రత్యేక శిక్షణ కారణంగా పోలీస్ వారికి ఎంతగానో సహాయపడతాయని తెలిపారు.ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ విశ్వాసానికి మారు పేరుగా నిలిచే జాగిలాలు పోలీస్ శాఖకు నేర పరిశోధనలో కీలకంగా మారుతున్నాయిని హత్యలు, దోపిడీలు, దొంగతనాలు జగిన సమయంలో నిందితులను పట్టించడం, సంఘవిద్రోహులు అమర్చే పేలుడు పదార్థాలను గుర్తించి భారీ ప్రాణ, ఆస్తి నష్టం నివారించడంలో పోలీసు జాగిలాలు అత్యంత కీలక పాత్రను పోషిస్తున్నాయిని అన్నారు. మాదకద్రవ్యాలు (డ్రగ్స్ ), బాంబులు (ఎక్సప్లసివేస్ ), మరియు ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించడంలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయిని జిల్లాలో అనేక కేసులను ఛేదించడంలో మరియు ఆధారాల సేకరణలో వీటి పనితీరు ప్రశంసనీయమైనదన్నారు. పోలీస్ జగిలాలకు అధునాతన శిక్షణ, వైద్య సంరక్షణ, మరియు తగిన సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆరు జగిలాలు ఉన్నాయని, వీటి నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీస్ జాగిలాల కోసం గదులను ఏర్పాటుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ కు ఎస్పీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ సమయంలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మెడల్ సాధించిన డాగ్ ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించి మెడల్ ను ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి బీమ్ రావు,డిఎస్పి లు రఘు చంధర్, రాములు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు, టౌన్ ఇన్స్పెక్టర్ వేణు గోపాల్, డీసీఆర్బీ, ఎస్బి, ఫింగర్ ప్రింట్స్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీ ఖాన్, శ్రీధర్, మరియు ఆర్ఎస్ఐలు, డాగ్స్ హాండ్లర్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.