వ్యభిచారం నర్వహిస్తున్న ఇద్దరి పై కేసు నమోదు
By: Mohammad Imran
On
వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు
చురకలు విలేఖరి
జగిత్యాల, ఫిబ్రవరి, 24
జగిత్యాల పట్టణానికి చెందిన ఇమ్రాన్ అనునతడు జగిత్యాలకు చెందిన మరొక మహిళతో కలిసి భవాని నగర్ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని, జగిత్యాల పట్టణము మరియు ఇతర ప్రాంతాలకు చెందిన పేద కుటుంబాలకు చెందినటువంటి మహిళలను డబ్బు ఆశ చూపించి, ఇక్కడికి తీసుకువచ్చి వ్యభిచారం చేపిస్తున్నట్టుగా అందిన సమాచారం మేరకు అక్కడికి వెళ్లి తనిఖీ చేయగా ఇద్దరూ నిరుపేద మహిళలు మరియు జగిత్యాల పట్టణానికి చేసిన ఒక విటుడిని ఆధీనంలోనికి తీసుకుని విచారించి, విటుడిపైన మరియు వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇమ్రాన్, ఒక మహిళ పైన కేసు నమోదు చేసినట్లు జగిత్యాల పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు.
Tags: