మడలేశ్వేరస్వామి ఆలయంలో చోరి....? పూజ సామాగ్రీ ఎత్తుకెళ్లాడానికి యత్నించిన దుండగుడు...
By: Mohammad Imran
On
మడలేశ్వేరస్వామి ఆలయంలో చోరి....?
పూజ సామాగ్రీ ఎత్తుకెళ్లాడానికి యత్నించిన దుండగుడు...
చురకలు విలేకరి, జగిత్యాల, ఫిబ్రవరి 21: జగిత్యాల జిల్లా కేంద్రంలోని మంచినీళ్ల బావి మడలేశ్వేరస్వామి ఆలయంలో ఇద్దరు వ్యక్తులు గురువారం అర్థరాత్రి చోరీకి పాల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మడలేశ్వేరస్వామి ఆలయంలో ఓ వ్యక్తి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి పూజ సామాగ్రిని తీసుకోని వెళ్తున్న క్రమంలో స్థానికులు పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. జగిత్యాల టౌన్ ఎస్ఐ గీత సంఘటన స్థలానికి చేరుకొని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారిలో ఉన్నట్లు తెలిసింది.
Tags: