జగిత్యాల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చోరీకి యత్నం. ఇంటి దొంగల పనేనా…?
జగిత్యాల సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చోరీకి యత్నం.
ఇంటి దొంగల పనేనా…?
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 4: జగిత్యాల పట్టణంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో మధ్య రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి చోరీకి యత్నించారు. ఉదయం కార్యాలయం తెరిచేందుకు వచ్చిన సిబ్బంది గమనించి సబ్ రిజిస్టార్ సమాచారం ఇవ్వడంతో వారు టౌన్ పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఎలాంటి నగదు ఉండకపోగా, విలువైన పత్రాలు ఉండడంతో పత్రాలు దొంగలించేందుకు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డట్లు అనుమానిస్తున్నారు.
ఇంటి దొంగల పనేనా…?
సబ్ రిజిస్టార్ కార్యాలయంలో విలువైన పత్రాలు ఉండడంతో ఇంటి దొంగల పనేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా జిల్లా ప్రధాన కార్యాలయాల క్వార్టర్స్ ఉండి నిరంతరం హడావిడి ఉండే ఈ ప్రాంతంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో చోరీకి యత్నించడం స్థానికంగా అందరినీ విస్మయపరుస్తుంది.