నమ్మించి మోసం చేసిన సైబర్ నేరస్తుడు అరెస్ట్

నమ్మించి మోసం చేసిన సైబర్ నేరస్తుడు అరెస్ట్

నమ్మించి మోసం చేసిన సైబర్ నేరస్తుడు అరెస్టు.


చురకలు విలేకరి, మెట్ పల్లి, ఫిబ్రవరి 21: మెట్ పల్లి సర్కిల్ పరిధిలోని మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన చదువుకునే విద్యార్థిని నమ్మించి మోసం చేసిన సైబర్ నేరస్తున్ని చాకచక్యంగా పట్టుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డీ తెలిపారు.ఈ మేరకు శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ నిరంజన్ రెడ్డీ మాట్లాడుతూ ముత్యంపేట గ్రామానికి చెందిన మామిడాల నితీష్ కుమార్ అనే విద్యార్థి లండన్ లో ఉన్నత చదువుల కోసం ప్రయత్నిస్తుండగా లండన్ లో ఉన్న షణ్ముఖ కృష్ణ యాదవ్ తనకు తానుగా నితీష్ కుమార్ ను పరిచయం చేసుకొని మాయమాటలతో నితీష్ కుమార్ కు ఇండియా డబ్బులతో ఫీజు కడితే ఎక్కువ ఖర్చు అవుతుందని, తన అకౌంట్ తిరుపతిలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందని డబ్బులు పంపిస్తే లండన్ కరెన్సీతో యూనివర్సిటీ డబ్బులు కడతానని మోసపూరితంగా నమ్మించగా కృష్ణా యాదవ్ ను నమ్మిన నితీష్ కుమార్ తన తల్లిదండ్రులకు చెప్పగా అప్పు చేసి మరీ నితీష్ కుమార్ తల్లి మామిడాల లత రూ.6,00,000 పంపించింనట్లు తెలిపారు. డబ్బులు పంపిన తర్వాత లండన్ సీట్ కు డబ్బులు కట్టినట్లు రసీదు పంపుతానని చెప్పిన కృష్ణ యాదవ్ కొన్ని రోజుల తరువాత సెల్ ఫోన్ ఆఫ్ చేయడంతో మోసపోయానని తెలుసుకున్న నితీష్ మల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశాడు. గత రెండేళ్ల  క్రితం కేసు నమోదు చేసి కృష్ణ యాదవ్ పై కోర్టు నుండి పర్మిషన్ తీసుకుని జిల్లా ఎస్పీ ద్వారా ఎల్ఓసీ తీసుకొగా మోసం చేసిన నేరస్తుడు దొరుకలేదు. గురువారం కృష్ణ యాదవ్ లండన్ నుండి హైదరాబాద్ విమానాశ్రయానికి  చేరుకున్నాడని ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వారు సిఐ నిరంజన్ రెడ్డికి ఇచ్చిన సమాచారం మేరకు వెంటనే హైదరాబాద్ విమానాశ్రయానికి మల్లాపూర్ ఎస్సై రాజు ఇమిగ్రేషన్ వారి అనుమతితో కృష్ణ యాదవ్ ని అదుపులోకి తీసుకున్నట్లు మాట్లాడారు. అనంతరం కృష్ణ యాదవ్ ను విచారించగా నితీష్ కుమార్ ని మోసపూరితంగా నమ్మించి డబ్బులను అవసరాలకు వాడుకున్నట్లు తెలుపగా కృష్ణ యాదవ్ అతని తండ్రిని వివిధ సెక్షన్ల ప్రకారం శిక్షించాలని కోర్టుకు తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చినట్లు తెలిపారు.సైబర్ నేరాలకు పాల్పడి అమాయకులను మోసం చేసి డబ్బులు తీసుకున్నట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని మరియు సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువకులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా ఫోన్ లు చేసి ఏదైనా మోసపూరిత విషయాలు చెప్పి నమ్మించినట్లయితే ప్రజలు గమనించి ఎవరికీ ఓటీపిలు గాని చెప్పకూడదని, ఏ అనుమానం ఉన్న వెంటనే 1930 కి ఫోన్ చేయాలని లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సిఐ నిరంజన్ రెడ్డి ప్రజలకు సూచించారు.IMG-20250221-WA0109

Tags:

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.