మద్యం మత్తులో పోలీసులపై దూసుకెళ్లిన వాహనం ఏ ఎస్ ఐ కు తీవ్ర గాయాలు
మద్యం మత్తులో పోలీసుల పైకి దూసుకెళ్లిన వాహనం
వాహన తనిఖీలు చేస్తున్న ఏ ఎస్ ఐ కి తీవ్ర గాయాలలు
చురకలు విలేఖరి
జగిత్యాల, ఫిబ్రవరి, 22
వాహన తనిఖీలు చేస్తున్న పోలీసుల పైకి మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఢీకొట్టడంతో ఏ ఎస్ ఐకి తీవ్ర గాయాలు కాగా ఢీకొట్టిన వాహనం పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్ర గాయాల పాలైన సంఘటన రాత్రి జగిత్యాల లో చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ శంకర్ పోలీస్ సిబ్బంది తో కలిసి గొల్లపల్లి రోడ్డులో వాహనాల తనిఖీలు చేపట్టారు. పెగడపల్లి మండలంలోని సుద్దపల్లి గ్రామానికి చెందిన బక్కయ్య, అంజయ్య లు మద్యం సేవించి ద్విచక్రవాహనంపై జగిత్యాలకు వస్తుండగా, రోడ్డు పై తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. మద్యం మత్తులో ఉన్న వారు పోలీసులకు దొరకవద్దని తమ వాహనాన్ని ఆపకుండా వెళ్లే ప్రయత్నంలో రోడ్డు మీద వాహనాలు ఆపుతున్న ఏఎస్ఐ శంకర్ ను వాహనం తో ఢీకొట్టారు. దాంతో ఏఎస్ఐ తలకు, కాలికి తీవ్ర గాయాలు కాగా, వాహనం పై ఉన్న బక్కయ్య, ఆంజయ్య లకు తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పై గాయాలతో పడిపోయిన ఏఎస్ఐ,బక్కయ్య, అంజయ్య ను చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏఎస్ఐ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ సదాకర్ ఆస్పత్రికి చేరుకుని ఏఎస్ఐ శంకర్ ను పరామార్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.