సినిమా షూటింగలకు జగిత్యాల కేంద్రం కావడం అభినందనీయం డీఎస్పీ రఘుచందర్
*సినిమా షూటింగులకు జగిత్యాల కేంద్రం కావడం అభినందనీయం*
*జగిత్యాల డిఎస్పి రఘుచందర్*
జగిత్యాల ప్రతినిధి :
జగిత్యాల జిల్లా కేంద్రంగా సినిమా షూటింగులు జరగడం శుభపరిణామమని జగిత్యాల డిఎస్పి రఘుచందర్ అన్నారు.
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం నగునూర్ లచ్చక్కపేటకు చెందిన ధన్ రాజ్ లెక్కల దరకత్వంలో గరుడవేగ అంజి ఫోటోగ్రఫీలో అమరావతి మూవీ మేకర్స్ అధినేత అశోక్ నిర్మాణ సారధ్యంలో నిర్మిస్తున్న "హే చికితా" సినిమా సన్నివేశాలను బుధవారం డీఎస్పీ రఘుచందర్, టౌన్ సీఐ వేణుగోపాల్ లు తిలకించారు.
జగిత్యాలలోని విరుపాక్షి గార్డెన్ లో పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సన్నివేశాలను తెరకేక్కించారు.
యూనిట్లో సినీ నటులు ఈటీవీ ప్రభాకర్ సీఐగా నటిస్తుండగా హీరో అభిరామ్, అతని స్నేహితులతో కలిసి పాల్గొన్న లొకేషన్ దర్శకులు ధన్ రాజ్, గరుడవేగా అంజి స్వీయ పర్యవేక్షణలో షూటింగ్ జరుగుతున్న తీరును తిలకించి చిత్ర యూని్టుని వారు అభినందించారు.
గత కొన్ని రోజులుగా నాగునుర్, లచ్చక్కపేట, ఆలూరు తదితర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరుగగా సినిమా హీరోయిన్ దివిజా ప్రభాకర్, మిగితా తారాగనం పాల్గొన్నారని ధన్ రాజ్ తెలిపారు.
సినిమా లొకేషన్ లో జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కిషన్ రెడ్డి, కళాశ్రీ అధినేత గుండేటి రాజు, సార ఆయన్స్ రెడ్డిలు పాల్గొని ధన్ రాజ్, గరుడ వేగా అంజి, నటులు అభిరామ్, ప్రభాకర్, చిత్ర యూనిటుకు అభినందనలు తెలిపారు.