జర్నలిస్టులకు ఇండ్ల స్థాలాలు కేటాయుంచాలి

జర్నలిస్టులకు ఇండ్ల స్థాలాలు కేటాయుంచాలి

*జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి*

*కొత్త అక్రిడేషన్ లు జారీ చేయాలి*


 *జిల్లా కలెక్టర్ కు తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకుల వినతి*

జగిత్యాల ప్రతినిధి : 
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండే మీడియాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, కనీస సమస్యలను పరిష్కరించకుండా ఏండ్ల తరబడి జాప్యం చేస్తున్నాయని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు నల్లాల జైపాల్  ఆరోపించారు.

 తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్త ఆందోళన లో బాగంగా జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు విజ్ఞప్తి చేశారు. 

అనంతరం  జైపాల్ మాట్లాడుతూ ఇండ్ల స్థలాల విషయంలో సర్కారు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సర్కారు రీవ్యూ పిటిషన్ వేసి వాదనలు చేయాలని, జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే కొత్త విధానం ద్వారా ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. 

కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని, ఉద్యోగుల మాదిరిగా అమలు చేయాలన్నారు. 

జర్నలిస్తుల కంట్రిబ్యూషన్ ను ప్రభుత్వమే భరించాలన్నారు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 కొత్త అక్రిడిటేషన్ కార్డులను అందజేయకుండా  రెండుసార్లు వాయిదా వేసిందని, వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త కార్డులివ్వాలన్నారు.

ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలుచేయాలని ప్రభుత్వన్ని జైపాల్ కోరారు.

రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని, ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రత్యేక రక్షణ చట్టాన్ని తేవాలన్నారు.

మహిళా జర్నలిస్టులకు పనిచేసే కార్యాలయం నుంచి ఇంటి వరకు రాత్రి పూట రవాణా సదుపాయం కల్పించాలని,అర్హత ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలు ఎంపానెల్మెంట్లో చేర్చాలన్నారు.

జర్నలిస్టుల దయనీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వెంటనే పై సమస్యలను పరిష్కరించేలా మీరు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కోరారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ద్యావర సంజీవ రాజు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మాకు రాజలింగం, కోశాధికారి మేన్నేని శ్రీనివాసరావు, ఆముద లింగారెడ్డి,వేముల కృష్ణ కుమార్, రేణిగుంట శ్రీనివాస్, ఉత్తం మహేశ్, ముల్క రాజేశం, మాణిక్యం గంగాధర్,ఓల్లాల రాజశేఖర్,బొల్లం అజయ్ కుమార్, చింతలపల్లి సతీశ్, అబ్బా డి సోమేశ్వర్, జాగర్ల మనోజ్ కుమార్, కుర్మ రమేశ్,అట్లా నగేశ్, పల్లె లక్ష్మి నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.IMG-20250224-WA0065

Tags:

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.