బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు.  జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు.

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 10 : బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటూన్నామని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది ఆర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామన్నారు.బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకొవాలని,పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్ట పరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని, ఫిర్యాదుదారుని కి భరోసా,నమ్మకం కలిగించాలన్నారు.బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు.IMG-20250310-WA0036

Tags:

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.