ప్రశాంత వాతావరణంలో రంజాన్ వేడుకలు జరుపుకోవాలి. జగిత్యాల డిఎస్పీ రఘు చందర్.
ప్రశాంత వాతావరణంలో రంజాన్ వేడుకలు జరుపుకోవాలి.
జగిత్యాల డిఎస్పీ రఘు చందర్.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 3: ప్రశాంత వాతావరణంలో రంజాన్ వేడుకలు జరుపుకోవాలని జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణంలోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ లో జగిత్యాల టౌన్ ఇన్స్ పెక్టర్ వేణుగోపాల్ తో కలిసి జగిత్యాల ముస్లిం నాయకులు, మసీదుల అధ్యక్షులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆదివారం నుండి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం అయిందని, జగిత్యాల జిల్లా కేంద్రంలో అనేక ఏళ్లుగా భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా అన్ని మతాల, కులాల వారు కలిసి మెలిసి ఉంటుంన్నారన్నారు. నెలరోజుల పాటు కఠిన ఉపవాసదీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు చేసుకోవడం ఆనాయితీగా వస్తోందన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీస్ అధికారుల దృష్టికి తీసుకోని రావాలని సూచించారు. రంజాన్ మసాన్ని భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ ఎస్ఐ మల్లేశం, వివిధ మసీదుల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.