ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవు.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 19: జగిత్యాల జిల్లా పరిధిలోని అక్రమ ఇసుక రవాణా ను నియత్రించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం ధర్మపురి మండలంలోని దమ్మన్నపేట మరియు అరెపెల్లి గ్రామాల్లోని గోదావరి నది ఇసుక రీచ్, వాగులను జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో కలిసి పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ అక్రమ ఇసుకను రవాణా చేసే లారీలు, ట్రాక్టర్లను తనిఖీ చేయడానికి అనేక ప్రదేశాలలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, అక్రమ ఇసుక రవాణా మరియు మైనింగ్‌ను నిరోధించడానికి ప్రతి మండల స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఇసుక అక్రమ రవాణా కు పాల్పడే వారి పై కేసులు నమోదు చేయడం తో పాటుగా వాహనాల ను సీజ్ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా గోదావరి నది తీరంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 4 ట్రాక్టర్లు ఇసుక లోడు తో ఉన్న వాహనాలను స్వయంగా పట్టుకున్నారు.