ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి. ప్రమాదంలో గాయపడిన యువకుడికి చికిత్స అందించడంలో ఆలస్యం. తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన యువకుడు.
ప్రభుత్వ సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.
ప్రమాదంలో గాయపడిన యువకుడికి చికిత్స అందించడంలో ఆలస్యం.
తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన యువకుడు.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 23 : జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. మృతుని స్నేహితుడు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మేడిపల్లి మండల కేంద్రం నుండి జగిత్యాల పట్టణానికి చెందిన రెడ్డిమల్ల స్నేహిత్ అనే యువకుడు తన ద్విచక్ర వాహనంపై జగిత్యాల వైపుకు వస్తుండగా జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామ శివారంలో గుర్తు తెలియని కారు వేరే వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో స్నేహిత్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో గాయాలపాలయ్యాడని తెలిపారు. ప్రమాద స్థలం నుండి అంబులెన్సులో జగిత్యాల ప్రధాన ఆస్పత్రికి తరలించగా మోకాలు ఎముక విరగడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా
వైద్యం చేయకుండా కూర్చున్నారని ఆరోపించాడు. సుమారు గంట సేపు వైద్యం చేయకుండా ఉన్న సిబ్బంది తాను విడియో తీస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది తనను బయటకు తోసేశారని, ఆ తర్వాత పట్టీలు కట్టి సీరియస్ గా ఉన్నాడని, కరీంనగర్కు తీసుకెళ్లాలని చెప్పడంతో అంబులెన్సులో కరీంనగర్కు తీసుకెళ్తున్న క్రమంలో మృతి చెందాడని, గాయపడిన తన స్నేహితుడిని జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించగా వైద్య సిబ్బంది సరైన సమయంలో వైద్యం చేయకపోవడంతోనే రెడ్డిమల్ల స్నేహిత్ మృతి
చెందాడని. తన స్నేహితుడి మృతికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.