దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.

దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు.  వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.

దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు.

వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 5 :  గత కొంతకాలంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా  దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఉబది శేఖర్ అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల డిఎస్పీ రఘు చందర్ తెలిపారు. బుధవారం జగిత్యాల డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిందితుడు పట్టణ, గ్రామాల శివారులో గల దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలు పాల్పడతాడని, ఇటీవల ఎస్ కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల సమీపంలో గల  నల్ల పోచమ్మ దేవాలయంలో, కోరుట్లలోని దేవాలయంలో దొంగతనాలకు పాల్పడ్డాడని తెలిపారు. 
బుధవారం పట్టణ సీఐ వేణుగోపాల్ రోజువారి తనిఖీల్లో భాగంగా
చిన్న కెనాల్ వద్ద  తనిఖీలు చేస్తుండగా నిందితుడు శేఖర్ పారిపోవడానికి ప్రయత్నించగా అనుమానంతో నిందితున్ని పట్టుకొని అతని వద్ద గల అనుమానాస్పద వస్తువులను తనిఖీ చేయగా నిందితుని వద్ద దేవాలయాలలో దొంగతనానికి పాల్పడ్డాడని వస్తువులు లభ్యమయ్యాయని, నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితునికి సహకరించిన మహిళ పరారీలో ఉందని వివరించారు. గత రెండు రోజుల క్రితం నర్సింగ్ కళాశాల,  సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో దొంగతనాలకు పాల్పడిన బాల నేరస్థుడిని కూడా అరెస్టు చేసి జూనైల్ హోమ్ కు తరలించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల టౌన్ ఇన్స్ పెక్టర్ వేణుగోపాల్, ఎస్ఐ కిరణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20250305-WA0087

Tags:

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.