ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దం. ఎన్నికలు నిర్వహణకు 233 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఎస్పీ అశోక్ కుమార్.
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్దం.
ఎన్నికలు నిర్వహణకు 233 మంది పోలీస్ లతో పటిష్ట బందోబస్తు.
పోలీస్ అధికారులు, సిబ్బంది ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించాలి.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 26 : జగిత్యాల జిల్లాలో స్వేచ్ఛయుత వాతావరణం లో ఎన్నికల నిర్వహణకు పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జగిత్యాలజిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. బుధవారం ఎన్నికల విధుల్లో భాగంగా పోలీస్ అధికారులు, సిబ్బందితో జిల్లా కేంద్రంలోని దేవి శ్రీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బ్రీఫింగ్ కార్యక్రమం నిర్వహించారు.ఎన్నికల విధులకు సంబంధించి పోలీసు అధికారులు, సిబ్బందికి ఎన్నికల ప్రాముఖ్యతను వివరిస్తూ, ఎన్నికల విధులు ఏవిధంగా పకడ్బందీగా నిర్వహించాలని, సిబ్బంది చేయవలసిన, చేయకూడాని విధుల గురించి జిల్లా ఎస్పీ క్షుణ్ణంగా వివరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించడం జరిగిందని, అదే స్ఫూర్తితో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాన్ని ఎట్టి పరిస్థితులలోనూ వదిలి వెళ్లరాదన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన వారితో మర్యాదపూర్వకంగా ఉండాలని, అనవసర విషయాలు చర్చించవద్దన్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో పోలింగ్ ప్రశాంత వాతావరణానికి భంగం కలిగే ఏ చిన్న సంఘటన ఎదురైన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు. ఓటర్లు ఎవ్వరూ కూడా సెల్ ఫోన్ లు, మందుగుండు సామాగ్రి, ఇంక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, పోలింగ్ బూతులోనికి తీసుకువెళ్లారాదని, సెల్ఫీలు దిగడం నిషేధమన్నారు. పోలింగ్ ముగిసిన తరువాత ఉన్నతాధికారాలు ఆదేశాలు లేనిదే ఎవ్వరూ కూడా తమ విధులనుండి వెళ్లరాదన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఎన్నికల సంఘంచే జారీ చేయబడిన నియమాలను పక్కగా అమలు చేస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగటానికి ఆస్కారం ఉన్న వెంటనే సంబంధిత యస్.హెచ్.ఒ.లకు, రూట్ మొబైలు అధికారికి సమాచారం అందించాలన్నారు. ఎట్టి పరిస్తుతుల్లోనూ అనాథరైజ్డ్ పర్సన్స్ పోలింగ్ స్టేషన్ లోనికి వెళ్లారాదని సూచించారు. జిల్లాలో మొత్తం (71) పోలింగ్ కేంద్రాల్లో గ్రాడ్యుయేట్స్ మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని, దీనికి సంబంధించి (233) మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. పటిష్టమేనా ఎస్కార్ట్ తో పోలింగ్ సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరుగుతుంది (12) రూట్స్ లలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటారని, ఇద్దరు డిఎస్పిలతో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ , (6) సీఐలతో స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్స్, ఎస్.ఐ లతో (18) పెట్రోలింగ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీంరావు, డిఎస్పీలు రఘు చందర్, రాములు,ఎస్బి ఇన్స్పెక్టర్ ఆరిఫ్ అలీ ఖాన్, సిఐలు వేణుగోపాల్, రవి, రామ్ నరసింహారెడ్డి,సురేష్, రవి, ఆర్ఐ లు వేణు, ఎస్ఐలు పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.