ఆస్తి తగాదాలతో అన్నపై దాడి చేసిన చెల్లెల్లు. చెల్లెల దాడిలో మృతి చెందిన అన్న

  ఆస్తి తగాదాలతో అన్నపై దాడి చేసిన చెల్లెల్లు.  చెల్లెల దాడిలో మృతి చెందిన అన్న

జగిత్యాలలో దారుణం.

ఆస్తి తగాదాలతో అన్నపై దాడి చేసిన చెల్లెల్లు.

చెల్లెల దాడిలో మృతి చెందిన అన్న

చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 23: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. సొంత అన్నపై ఇద్దరు చెల్లెలు కర్రలతో దాడి చేయడంతో దాడిలో జంగిలి శ్రీనివాస్ (52) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జంగిలి శ్రీనివాస్ ఆర్టిఏ ఏజెంట్ గా పని చేస్తూ జీవనం  కొసాగిస్తున్నాడని, మృతునికి ఇద్దరు చెల్లెలు భారతపు వరలక్ష్మి, వోడ్నాల శారదలు ఉన్నారని, గతంలో వీరికి వివాహాలు కాగా భారతపు వరలక్ష్మి భర్త మృతి చెందడంతో తన అన్న
అయిన శ్రీనివాస్ ఇంటి వద్దనే ఉంటుంది. మరో చెల్లెలు వోడ్నాల శారద తన భర్తను వదిలేసి మృతుని ఇంటి ప్రక్కనే అద్దెకు నివాసం ఉంటుంది. మృతుని తండ్రి బసవయ్య శ్రీనివాస్ ఇంటి ప్రక్కన ఉన్న 100 గజాల స్థలాన్ని తన కుమారుడికి ఇస్తాననడంతో ఈ స్థలాన్ని ఇద్దరు కూతుళ్లు తమకు ఇవ్వాలని తండ్రికి చెప్పడంతో అప్పటి నుండి స్థల విషయంలో వీరికి వివాదం ఏర్పడగా, గత కొంతకాలంలో కోర్టులో కేసు నడుస్తుంది. ఆదివారం ఉదయం శ్రీనివాస్ పోచమ్మవాడలోని తన తల్లిదండ్రులను కలువడానికి ఇంటికి వెళ్లగా, భారతపు వరలక్ష్మి, వోణ్నాల శారదలు తమ సోదరుడు శ్రీనివాస్ను రోడ్డుపై కిందపడేసి కర్రలతో,చేతులతో పిడిగుద్దులతో దాడి చేయడంతో శ్రీనివాస్ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో
గమనించిన కుటుంబసభ్యులు శ్రీనివాస్ ను జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు ధృవీకరించారని తెలిపారు.
మృతుని భార్య జంగిలి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ తెలిపారు.IMG-20250223-WA0037

Tags:

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.