గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు యువకుల అరెస్టు. 1121 గ్రాముల గంజాయి స్వాధీనం. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.

గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు యువకుల అరెస్టు.  1121 గ్రాముల గంజాయి స్వాధీనం.  వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.

గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు యువకుల అరెస్టు.

1121 గ్రాముల గంజాయి స్వాధీనం.

వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 19 : గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ తెలిపారు. బుధవారం జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ వివరాలు వెల్లడించారు. ఈ సందర్బంగా డిఎస్పీ మాట్లాడుతూ జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి గ్రామ శివారులో ముగ్గురు యువకులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు ముగ్గురిని అదుపులోకి తీసుకోని వారి వద్ద నుండి 130 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రఘురాములకోట గ్రామ శివారులో ఇద్దరు యువకులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఇద్దరిని జగిత్యాల రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 1211 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రెండు కేసుల్లో ఐదుగురు నిందితులు మానుక కులదీప్, బొక్కేనపల్లి పవన్ కుమార్, మగ్గిడి రాకేష్, కోరేపు వినయ్, అనుమల్ల లోకేష్ కుమార్ లు జగిత్యాల పట్టణానికి చెందిన వారని తెలిపారు. వీరు ఉట్నూరు నుండి ఓ వ్యక్తి వద్ద నుండి గంజాయి తీసుకోని వచ్చి విక్రయిస్తున్నారని వివరించారు. గంజాయి విక్రయించిన, సరఫరా చేసిన, సేవించిన చట్టరీత్య చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సిబ్బందికి రివార్డులు అందించారు. ఈ సమావేశంలో జగిత్యాల రూరల్ సీఐ వై.కృష్ణారెడ్డి, ఎస్ఐ సధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.IMG-20250219-WA0004

Tags:

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.