కష్టపడి చదివితేనే విద్యార్థులకు గుర్తింపు హైకోర్ట్ జడ్జి పుల్ల కార్తీక్
కష్టపడి చదివితేనే విద్యార్థులకు గుర్తింపు
తెలంగాణ హైకోర్టు జస్టిస్ పుల్ల కార్తీక్
చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 22 : కష్టపడి చదివితేనే విద్యార్థులకు గుర్తింపు లభిస్తుందని తెలంగాణ హైకోర్టు జస్టిస్ పుల్ల కార్తీక్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్ఆకెఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో క్రీడా, సాంస్కృతిక దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా కాసుగంటి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కళాశాలలోని వివిధ గ్రూపుల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు రూ.2.50లక్షల నగదు పురస్కారాలను విద్యార్థులకు జస్టిస్ పుల్ల కార్తీక్ చేతుల మీదుగా అందించారు. అనంతరం జస్టిస్ పుల్ల కార్తీక్ మాట్లాడుతూ కష్టపడి చదివితేనే విద్యార్థులకు గుర్తింపు లభిస్తుందని, తాను ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా కళాశాల కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. విద్యాభివృద్ధికి సహకరిస్తున్న కాసుగంటి కుటుంబానికి, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాసుగంటి లక్ష్మణ్
కుమార్ ను అభినందించారు. ప్రతి విద్యార్థి కష్ట పడి
చవిదితేనే వృద్ధిలోకి రాగలరన్నారు. తాను ఈ స్థాయికి రాగలిగనంటే అధ్యాపక బృందం కృషినేనన్నారు. అనంతరం న్యాయవాది కాసుగంటి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల
ప్రాంతంలో విద్యాభివృద్ధికి పాటుపడడమే తమ కుటుంబం ప్రధాన ధ్యేయమన్నారు. కళాశాల అభివృద్ధి కోసం కాసుగంటి నారాయణరావు అందించిన 32 ఎకరాల భూమి ఆక్రమణకు
గురి కాకుండా కాపాడటంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా.ఏ. అశోక్, జిల్లా ఇంటర్మీడియేట్ అధికారి నారాయణ. రెడ్ క్రాస్ సోసైటి సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లు, ఎన్సిసి కళాశాల అధికారి రాజు, అధ్యాపకులు, న్యాయవాదులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.