పరీక్షలు వ్రాసే విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహారించాలి సీఐ నిరంజన్ రెడ్డి

పరీక్షలు వ్రాసే విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహారించాలి సీఐ నిరంజన్ రెడ్డి

పరీక్షలు వ్రాసే విద్యార్థులు అప్రమత్తంగా వ్యవహరించాలి 
ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి 

చురకలు ప్రతినిధి 
మెట్ పల్లి, మార్చి, 04


ఇంటర్మీడియట్ పరీక్షలు రాయబోతున్న విద్యార్థి విద్యార్థినులకు మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు  తెలిపారు.
పరీక్షల్లో విజయం సాధించడం ఎలా 
పరీక్షకు ఒక రోజు ముందు  చదివే దానిని ప్రిపరేషన్ అనరని,మొదటి రోజు నుండి ప్రిపేర్ అయ్యేదే నిజమైన ప్రిపరేషన్ అంటే పరీక్ష ప్రిపరేషన్ ఎప్పటికప్పుడు తరగతిలో పాఠం వినడం, అదేరోజు చదవడం తిరిగి, పరీక్షలకు ముందు చదవడం దీనిపై పూర్తిస్థాయి ప్రిపరేషన్ అంటారని మెట్ పల్లి ఇన్స్పెక్టర్ అనుముల నిరంజన్ రెడ్డి అన్నారు.కానీ ఎంతమంది ఇలా చేస్తున్నారు అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవలసిన విషయం అని 
ప్లానింగ్ ఇలా చేసుకోవాలని,
 పరీక్షలకు ఎంత సమయం ఉందో చూసుకొని ప్రణాళిక వేసుకోవడం,
రెండవది ఎన్ని సబ్జెక్టులు చదవాల్సి ఉన్నాయి,
మూడవది ఒక్కొక్క సబ్జెక్టులో ఎన్ని చాప్టర్లు ఉన్నాయి,
నాల్గవది ఎన్ని రోజుల్లో ఏ ఏ సబ్జెక్టులు చదవగలరు అని చదవాల్సిన స్థలాన్ని ఎంచుకోవడం సబ్జెక్టుల వారిగా నోట్స్ చేసి పెట్టుకోవడం చదివేటప్పుడు అవసరమైతే తమ స్నేహితుడి సహాయం తీసుకోవడం పరీక్షకు కావలసిన ప్యాడ్ పెన్సిల్ పెన్నులు  ముందే ఏర్పాటు చేసుకోవడం, వీటన్నిటికన్నా ముందు మానసికంగా పరీక్షాలకు తమ మనసుని సిద్ధం చేసుకోవడం విషయాన్ని అర్థం చేసుకొని చదవాలని,భట్టి కొట్టకుండా చదివేటప్పుడు ముఖ్యమైన విషయాలు మైండ్ మ్యాప్ టెక్నిక్ ఉపయోగించుకొని గుర్తుంచుకోవాలని నిరంజన్ రెడ్డి అన్నారు.
మొదటిది మ్యాథమెటిక్స్ లో సూత్రాలు విలువలు, సైన్స్ లో శాస్త్రీయ నామాలు, రసాయన చర్యలు,నాలుగవది సోషల్ లో సంవత్సరాలు పేర్లు స్థలాలు, తెలుగులో అర్ధాలు సందులు సమాసాలు, వ్యాకరణాలు, హిందీలో కఠినమైన పదాలు, ఇంగ్లీషులో కఠిన పదాలు వాటి అర్థాలు 
వీటితోపాటు తాము ఎన్ని మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నరో,ఒక చార్ట్ పై పెద్దగా రాసుకొని ఎదురుగా గోడపై అతికించుకొని రోజు చూస్తూ ఉండలని ప్రతిరోజు రాత్రి తాము ఎంత చదివరో,ఎంత విన్నారో,స్వీయ పరిశీలన చేసుకోవాలని,ఏ ప్రశ్నకు ఎంత సమయం పడుతుందో ఒకటి రెండు సార్లు రాసి చూసుకోవాలని,పరీక్ష రాసేముందు చక్కని ప్లానింగ్ తో చక్కగా ప్రిపేర్ అయి పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉండాలని,
పరీక్ష రాయడం ఎలా పరీక్ష హాలు లోకి వెళ్ళగానే తమ హాల్టికెట్ నెంబర్ చూసుకొని వెళ్లి కూర్చొని ప్రశాంతంగా ఒకసారి గాలి పీల్చుకొని, బదులు ప్రశ్న పత్రం తమ చేతిలోకి రాగానే ఇలా అనుకోని,మనసులో తాము అన్నింటిని చక్కగా ప్రిపేర్ అయ్యారో బాగా రాస్తాను అని తలచుకొని ప్రశ్న పత్రం ఓపెన్ చేసి తర్వాత ఏ ప్రశ్నకు ఎంత సమయం  కేటాయించాలో ప్రిపరేషన్ లో తెలుసుకొని  అదే విధంగా రాయడం ప్రారంభం చేసి మొదటి ప్రశ్నకు ఎంత ఇంట్రెస్ట్ తో సమాధానం రాస్తారో,ఆఖరి ప్రశ్నకు కూడా అంతే ఇంట్రెస్ట్ తో సమాధానం రాయాలని ఎందుకంటే ప్రతి ప్రశ్న ప్రత్యేకమే సమాధాన పత్రంతో దేవుళ్ళ పేర్లు రాయడం నన్ను పాస్ చేయండి అని రాయడం లాంటి చేయకూడదని,చివరిగా అన్నింటికీ సమాధానాలు రాసిన హాల్ టికెట్ నంబర్ సరిగ్గా రాశారో లేదో చెక్ చేసుకొని పేపర్ జాగ్రత్తగా థ్రెడ్ వేసి ఇచ్చి బయటకు రావాలని  మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ అనుముల నిరంజన్ రెడ్డి సూచించారు.IMG-20250304-WA0093

Tags:

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.