మెట్ పల్లి సీఐకి ఇండియన్ పోలీస్ మెడల్ 2025వ సంవత్సరానికి సీఐ నిరంజన్ రెడ్డి ఎంపిక
మెట్ పల్లి సీఐకి ఇండియన్ పోలీస్ మెడల్
మెడల్ అందుకోనున్న సీఐ నిరంజన్ రెడ్డి
చురకలు విలేకరి, మెట్ పల్లి, జనవరి 25 : పోలీస్ శాఖలో అందించిన సేవలకు గాను కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ఇండియన్ పోలీస్ మెడల్కు జగిత్యాల జిల్లా మెట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి ఎంపికయ్యారు. 2025 వ సంవత్సరానికి గాను
ఆయన ఇండియన్ పోలీస్ మెడల్ కు ఎంపిక అయ్యారు . శనివారం ఆయన మాట్లాడుతూ పోలీస్ శాఖలో అందించిన సేవలను గుర్తిస్తూ కేంద్రప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్కు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు. 1989లో
పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నిరంజన్రెడ్డి, జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో 1990లో కానిస్టేబుల్ విధుల్లో చేరారు. కానిస్టేబుల్గా విధులు
నిర్వ ర్తిస్తున్న సమయంలో పలు తీవ్రవాద వ్యదిరేక పోరాటంలో ఎదురుకాల్పుల్లో పాల్గొన్నారు. 1992లో తన స్వంత గ్రామంలో నక్సలైట్ల 2 దళాలు కాల్పులు జరుపగా సీఐ నిరంజన్ రెడ్డి తో పాటు మరో కానిస్టేబుల్ శంకర్ గాయాల పాలయ్యారు. 1992 అక్టోబర్లో ప్రభుత్వం హెడ్ కానిస్టేబుల్గా అగ్జిలరీ ప్రమోషన్ కల్పించి సిరిసిల్లలో పోస్టింగ్ ఇచ్చింది. 1994లో ముఖ్యమంత్రి సేవ పథకానికి నిరంజన్ రెడ్డి ఎంపికయ్యారు. 2000లో ఏఎస్ఐగా పదోన్నతి పొందిన నిరంజన్ రెడ్డి, 2012 సినియార్టీ ప్రకారం ఎస్ఐగా పదోన్నతి పొంది జగిత్యాల జిల్లా గొల్లపల్లి ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. 2013 నుండి 2015లో గొల్లపల్లి ప్రతి ఏడాది నవంబర్ 14న 5వేల మంది విద్యార్థుల బాలల దినోత్సవాన్ని జరిపించారు. 2014లో గొల్లపల్లి మండలంలోని ఆత్మకూరు గ్రామంలో 12వేల మందికి మెడికల్ క్యాంపును నిర్వహించారు. అనంతరం గొల్లపల్లి పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని రాష్ట్ర డిజిపి
చేతుల మీదుగా ప్రారంభించారు. 2016లో కథలాపూర్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన నిరంజన్రెడ్డి కథలాపూర్లో నకిలీ వైద్యులను పట్టుకొని పేదలకు న్యాయం చేశారు. ముంబాయిలో జీవితఖైదు పడి జైలు నుండి తప్పించుకొని తిరుగుతున్న తాండ్రియ్యాల గ్రామానికి చెందిన శ్రీహరిని మహారాష్ట్ర పోలీసులకు అప్పగించి మహారాష్ట్ర డిజిపి నుండి రివార్డును అందుకున్నారు. 2017, 2018లో జగిత్యాల ఎన్ఎస్ఐబీ, ఎస్బిలో విధులు నిర్వర్తించారు. 2023లో నిరంజన్రెడ్డి సీఐగా అగ్జిలరీ ప్రమోహన్ పోంది మెట్పల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఒక్కసారి ముఖ్యమంత్రి సేవా పథకం, 54 నగదు రివార్డులు, జిఎస్ఈలు 49, 32 సార్లు ప్రశంసపత్రాలను అందుకున్న ఆయన పోలీస్ శాఖలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ పోలీస్ మెడలు ఎంపిక కావడం పట్ల జగిత్యాల జిల్లా పోలీస్ యంత్రాంగం ఆయన శుభాకాంక్షలు తెలిపింది.