ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్టు. 1 కారు, 5 ద్విచక్ర వాహనాలు, 5 ఫోన్లు స్వాధీనం... వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్టు.
1 కారు, 5 ద్విచక్ర వాహనాలు, 5 ఫోన్లు స్వాధీనం...
వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 9: ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ తెలిపారు. ఆదివారం జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత నెలలో జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేటలో, సారంగాపూర్ మండలంలో ద్విచక్రవాహనాలు చోరికి గురయ్యాయని, నిందితులను పట్టుకోవడానికి జగిత్యాల రూరల్ సీఐ వై. కృష్ణారెడ్డి, ఎస్ఐ సధాకర్ ఆధ్వర్యంలో బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఆదివారం ఐదుగురు నిందితులను తిప్పన్నపేట గ్రామం వద్ద అదుపులోకి తీసుకోని వారి వద్ద నుండి ఓ కారు, 5 ద్విచక్ర వాహనాలు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులైన జక్కుల గోపాల్, సింగం రాజు, నేరెళ్ల నరేష్, సంపతి కుమారస్వామిలు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగుకు చెందిన వారని, మరో నిండితుడు బుర్ర రాజేందర్ కొమురంభీం జిల్లా తీర్యాని మండలానికి చెందిన వారని, నిందితులు వృత్తి రీత్యా డ్రైవర్లుగా పని చేస్తున్నారని తెలిపారు. నిందితులందురు ఓ ముఠాగా ఏర్పడి కలమడుగును కారులో వచ్చి ఇండ్ల ముందు పార్క్ చేసిన ఉన్న ద్విచక్రవాహనాలను దొంగలించారన్నారు. నిండుతుల వద్ద నుండి ఓ కారు, 5 ద్విచక్ర వాహనాలు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించామని తెలిపారు. ద్విచక్రవాహనాలను దొంగలిస్తున్న ముఠాను పట్టుకున్న జగిత్యాల రూరల్ సీఐ వై. కృష్ణారెడ్డి, ఎస్ఐ సధాకర్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, గంగాధర్, రాహుల్, ఉమర్, మోహన్ లను జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ అభినందించారు. ఈ సమావేశంలో జగిత్యాల రూరల్ సీఐ వై. కృష్ణారెడ్డి, ఎస్ఐ సధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.