పోలీసు శాఖలో ఆర్మడ్ రిజర్వ్ విభాగం పాత్ర కీలకం. జగిత్యాల జిల్లా అశోక్ కుమార్

పోలీసు శాఖలో ఆర్మడ్ రిజర్వ్ విభాగం పాత్ర కీలకం.  జగిత్యాల జిల్లా అశోక్ కుమార్

పోలీసు శాఖలో ఆర్మడ్ రిజర్వ్ విభాగం పాత్ర కీలకం.

జగిత్యాల జిల్లా అశోక్ కుమార్
 
ఘనంగా సాయుధ బలగాల డీ-మొబిలైజేషన్ పరేడ్.


చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 3: శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్, ప్రధాన విభాగాలతో పాటు ఏఆర్ విభాగం కూడా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తొందని జగిత్యాల జిల్లా అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నో సమస్యాత్మక పరిస్థితుల్లో, పండుగల బందోబస్తు, ఎన్నికల బందోబస్తు నిర్వహణ, గణేష్ నిమజ్జనం ఊరేగింపు వంటి విధుల నిర్వహణలో ఆర్మ్డ్ రిజర్వు పోలీసుల కృషి ఎంతో ఉందని అభినందించారు. సోమవారం జిల్లా పోలీసు హెడ్క్వార్టర్స్ లో గత 15 రోజుల పాటు సాగిన జిల్లా అర్మడ్ రిజర్వ్ సిబ్బంది మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమంలో జిల్లా అశోక్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా అర్మడ్ సిబ్బంది నుండి ఎస్పీ గౌరవ వందనాన్ని స్వీకరించారు. 05 ప్లటూన్లతో ఏర్పాటు చేసిన ఈ పరేడ్ కు అడ్మిన్ ఆర్ఐ కిరణ్ కుమార్ ప్లటూన్ కమాండెర్ గా వ్యవహరించారు. పదిహేను రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఇండోర్,ఔట్డోర్, ఫైరింగ్ ప్రాక్టీస్ లో పాల్గొన్నారని ఏఆర్ అదనపు ఎస్పి బీమ్ రావు ఎస్పీకి వివరించారు. అనంతరం ఎస్పీ మట్లాడుతూ ఆర్ముడ్ రిజర్వ్ సిబ్బంది మొత్తం ఒకే దగ్గరకు వచ్చి శిక్షణా సమయంలో నేర్చుకున్న అంశాలను మరోసారి గుర్తు చేసుకునే అవకాశం మోబిలైజేషన్ ద్వారా కలుగుతుందన్నారు. పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని,భాద్యతగా తమ విధులను నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలందించాలని సూచించారు.ఈ మొబిలైజేషన్ కార్యక్రమం ద్వారా శారీరక దృడత్వంతో పాటు మానసిక ఉల్లాసం కూడా లభిస్తుందన్నారు. అనంతరం అక్కడ పాల్గొన్న అధికారులు,సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.వెంటనే అట్టి సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపడతామని తెలియజేశారు. నిరంతరం విధులలో ఉండే పోలీసు అధికారులు,సిబ్బందికి వ్యక్తిగత, కుటుంబపరమైన,శాఖాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లపుడూ ముందుంటామని వివరించారు.ఈ డీ-మొబిలైజేషన్ పరేడ్ కార్యక్రమాన్ని సుందరంగా ఏర్పాటుచేసిన అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి బీమ్ రావు ,రిజర్వ్ ఇన్స్పెక్టర్ లు కిరణ్ కుమార్ ,రామకృష్ణ ,వేణు, రిజర్వ్ సబ్- ఇన్స్పెక్టర్లు మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.IMG-20250203-WA0057

Tags:

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.