క్యాన్సర్ తో మృతి చెందిన ఎస్ఐ కుటుంబానికి ఆర్ధిక సహాయం. రూ. 4లక్షల చెక్కును అందించిన జిల్లా ఎస్పీ.

క్యాన్సర్ తో మృతి చెందిన ఎస్ఐ కుటుంబానికి ఆర్ధిక సహాయం.  రూ. 4లక్షల చెక్కును అందించిన జిల్లా ఎస్పీ.

క్యాన్సర్ తో మృతి చెందిన ఎస్ఐ కుటుంబానికి ఆర్ధిక సహాయం.

రూ. 4లక్షల చెక్కును అందించిన జిల్లా ఎస్పీ.

చురకలు ప్రతినిధి, జగిత్యాల,  ఫిబ్రవరి 3 : 2012 పోలీస్ ఎస్ఐ బ్యాచ్ కు  చెందిన తోటి మిత్రుడు రాజమౌళి 2018 సంవత్సరంలో క్యాన్సర్ తో మరణించగా అతడి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విధులు నిర్వహిస్తున్న 2012 పోలీస్ ఎస్ఐ బ్యాచ్ మేట్స్ కలిసి 4 లక్షల రూపాయలు సమకూర్చారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చేతుల మీదుగా రాజమౌళి సతీమణి ,కూతురుకి 4 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 2012 పోలీస్ బ్యాచ్ కి చెందిన తోటి బ్యాచ్ మేట్స్ తాము అండగా ఉన్నామని ముందుకు వచ్చి రాజమౌళి కుటుంబానికి 4 లక్షలు ఆర్ధిక సాయం అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. రాజమౌళి కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని, వారికి ఏదైనా సమస్య వస్తే నేరుగా సంప్రదించవచ్చునన్నారు.  ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్,వేణుగోపాల్, కృష్ణా రెడ్డి ,రవి ,వేణు ,రహీమ్ పాల్గొన్నారు.IMG-20250203-WA0044

Tags:

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.