సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కల్గి ఉండాలి.
సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరు అవగాహన కల్గి ఉండాలి.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 5: జగిత్యాల జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పాఠశాలల్లో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా పలు సైబర్ మోసాలు జరుగుతున్నాయని, ఓఎల్ఎక్స్ మోసాలు, ఏపికె ఫైల్ను ఉపయోగించి పకిలీ కస్టమర్ కేర్ మోసాలు, క్రిప్టో, బిట్కాయిన్ మోసాలు జరుగుతున్నాయన్నారు. మొబైల్ ఫోన్లకు ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి, మేసేజ్ చేసి బ్యాంకు వివరాలు అడిగినా, ఓటిపిలు అడిగినా చెప్పవద్దని, ఆశ చూపి ఇన్వెస్ట్ చేయాలని కోరినా డబ్బులను ఇన్వెస్ట్ చేయవద్దన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో ఉపాధ్యాయులు తమవంతుగా పాత్ర పోషించాలని, ఆన్లైన్లో మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అవగాహన కల్గి ఉండాలన్నారు.