పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి ఎస్పీ అశోక్ కుమార్
పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించాలి
రోడ్డు ప్రమాదాల నివరణపై అన్ని స్థాయిల అధికారులు మరింత దృష్టి సారించాలి.
పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచాలి.
జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
చురకలు ప్రతినిధి, జగిత్యాల, జనవరి 29 : సమస్యలను క్షేత్ర స్థాయిలో గుర్తించి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించే విధంగా పోలీస్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నెలవారి క్రైమ్ మీటింగ్ సమావేశాన్ని నిర్వహించారు. గత నెలలో జరిగిన నేరాలపై చర్చించి పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసుల విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కొత్త కేసులతో పాటు చాలా కాలంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు పని చేయాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపించి వాటి సంఖ్యను తగించేలా కృషి చేయాలని అన్నారు. నేర నియంత్రణలో బాగంగా సొసైటీ పర్ పబ్లిక్ సేఫ్టీ లో బాగంగా ప్రతి పట్టణంలోని కాలనీల్లో,గ్రామాలలో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేల ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదాల నివారణ కొరకు రోడ్డు భద్రతపై అవగాహన సమావేశాలు నిర్వహించాలని అన్నారు.దొంగతనాలు జరగకుండా రాత్రి పూట గస్తి బీట్‌లు, పెట్రోలింగ్ నిర్వహించాలని 100 కాల్ కి వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందజేయలాని అన్నారు.
విది నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అదికారులకు, సిబ్బందికి ప్రశంశ ప్రోత్సాహకాలు
విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఈ సమావేశంలో డిఎస్పి లు రఘు చంధర్, రాముల, రంగా రెడ్డి, మరియు డీసీఆర్బి,ఎస్బి,సీసీఎస్, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్,ఆరిఫ్అలీఖాన్,రఫీక్ ఖాన్, రిజర్వ్ ఇనస్పెక్టర్ లు కిరణ్ కుమార్ ,వేణు మరియు సి.ఐ లు వేణుగోపాల్,రామ్ నరసింహారెడ్డి,రవి,నిరంజన్ రెడ్డి, కృష్ణ రెడ్డి, సురేష్ ,మరియు ఎస్.ఐ లు,డీసీఆర్బి, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.