ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సీఐకు సన్మానం
ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కు సన్మానం..
చురకలు ప్రతినిధి
మెట్ పల్లి , జనవరి 29
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక ఇండియన్ పోలీస్ మెడల్ కు మెట్‌పల్లి సీఐ నిరంజన్ రెడ్డిని ఎంపిక చేయడంతో బుధవారం మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా (టి యు డబ్ల్యూ జే ఐజేయు) ఆద్వర్యంలో కార్యవర్గ సభ్యులు సీఐ నిరంజన్ రెడ్డిని పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. జాతీయ స్థాయిలో అందజేసే ప్రతిష్టాత్మక అవార్డు కు మెట్‌పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో నిరంజన్ రెడ్డి ఎంపిక కావడం గర్వంగా ఉందని. అవార్డు ప్రదానోత్సవం లో దేశ రాజధానిలో రాష్ట్రపతి నోట మెట్‌పల్లి పేరు వినబడుతుండడం సంతోషదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా అద్యక్షుడు ఆగ సురేష్, ప్రధాన కార్యదర్శి భూరం సంజీవ్, ఉపాధ్యక్షుడు మహమ్మద్ అజీమ్, కార్యవర్గ సభ్యులు సాజీత్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.