మైనర్ బాలిక అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష బాధిత మైనర్ బాలికకు రూ.2లక్షల పరిహారం

మైనర్ బాలిక అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష

బాధిత మైనర్ బాలికకు రూ.2లక్షల పరిహారం

చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఫిబ్రవరి 3: జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో గతంలో నమోదైన మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడైన సుంకల శ్రీనివాస్కు 20 ఏళ్ల కఠిన కారాగార జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ సోమవారం జిల్లా న్యాయమూర్తి నీలిమ తీర్పు వెలువరించారు. ఈ కేసులో బాధితురాలైన మైనర్ బాలికకు రూ.2లక్షల
పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో నేరం చేసిన వారు ఏవరు కూడా శిక్ష నుండి తప్పించుకోలేరని, పోలీసులు, ప్రాసిక్యూషన్ సిబ్బంది న్యాయ విచారణ, న్యాయ నిరూపణ వేగవంతంగా జరిపి ఖచ్చితంగా శిక్షలు పడేలా చూస్తారన్నారు. మైనర్ బాలిక
అత్యాచారం కేసులో నిందితుడికి శిక్ష పడటానికి కృషి చేసిన పిపి చీటి రామకృష్ణారావు, విచారణాధికారులు డిఎస్పీలు వెంకటరమణ, ఆర్.ప్రకాష్, ఇన్స్పెక్టర్ జయేష్రెడ్డి. సిఎంఎస్
ఎస్ఐ శ్రీకాంత్, కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్, సిఎంఎస్ కానిస్టేబుళ్లు కిరణ్, శ్రీధర్లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Tags:

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.