కిడ్నాప్ వార్తల్లో నిజం లేదు. జగిత్యాల టౌన్ ఇన్స్ పెక్టర్ వేణుగోపాల్
కిడ్నాప్ వార్తల్లో నిజం లేదు.
జగిత్యాల టౌన్ ఇన్స్ పెక్టర్ వేణుగోపాల్.
చురకలు విలేకరి, జగిత్యాల, ఫిబ్రవరి 3 : కిడ్నాప్ వార్తల్లో నిజం లేదని జగిత్యాల టౌన్ ఇన్స్ పెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ కు
పుండాలోళ్ళ రాజు, పుండాళ్ల గంగ లక్ష్మి, ప్రస్తుతం మెట్పల్లి బస్ స్టాండ్ ప్రాంతంలో నివసిస్తున్నారని, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారని, వీరి కుమార్తె అమ్ములు, జగిత్యాల బాలసదనంలో ఉందని, అబ్బాయి మాత్రం వీరివద్దనే ఉన్నాడన్నారు. శనివారం వారు జగిత్యాలకు తమ కుమార్తె అమ్ములను చూడటానికి వచ్చారని, అప్పటినుండి వారు జగిత్యాలలో ప్లాస్టిక్ సేకరిస్తూ తిరుగుతున్నారని,
వారు సోమవారం ఉదయం 11 గంటల సమయంలో చింతకుంట వాడ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నపుడు ఒక చిన్న పాప వారిని చూసి ఏడ్వడం జరిగిందన్నారు. స్థానికులు వారిని పిల్లలను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్న కిడ్నాపర్లు అని అనుమానించి 100 డయల్ కాల్ చేశారన్నారు. వారిని విచారించగా వారు కిడ్నాపర్లు కారు మెట్పల్లి ప్రాంతంలో ప్లాస్టిక్ వస్తువులు సేకరిస్తూ జీవనం కొనసాగిస్తారని, బాలసదనంలో ఉన్న వారి కూతురుని కలవడం కోసం జగిత్యాలకు వచ్చారని, ఎటువంటి కిడ్నాప్ ప్రయత్నం జరగలేదని విచారణలో తెలిసిందన్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.