మహాకుంభమేళాలో తప్పిపోయిన జగిత్యాలవాసులు ఆందోళనలో కుటుంబసభ్యులు
By: Mohammad Imran
On
మహాకుంభమేళాలో తప్పిపోయిన జగిత్యాల వాసులు
ఆందోళనలో కుటుంబసభ్యులు
చురకలు ప్రతినిధి, జగిత్యాల, జనవరి 31 : జగిత్యాల జిల్లా కేంద్రం నుండి ఉత్తర్ ప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభామేళాకు వెళ్లిన ఇద్దరు మహిళలు తప్పిపోయారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్కు చెందిన వీర్ల నర్సవ్వ, కొత్తవాడకు చెందిన ఆది రాజవ్వ పట్టణానికి చెందిన మరో 8 మంది. కడెంకు చెందిన మరో ఇద్దరు మొత్తం 12 మంది కలసి గత కొన్ని రోజుల క్రితంగా మహాకుంభామేళాకు తరలివెళ్లారు. అయితే శుక్రవారం వీరిలో జగిత్యాలకు చెందిన వీర నర్సయ్య, ఆది రాజవ్వ, కడెంకు చెందిన ఇద్దరు మహిళలు తప్పిపోయినట్లు సమాచారం. వీరి సెల్ఫోన్లు మిగితా 8 మంది వద్ద ఉండడంతో వారి ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న వారి కుటుంబసభ్యులు
ఆందోళనకు గురై వారి ఆచూకీ తెలుసుకోవడానికి ఉత్తరప్రదేశ్ కు బయలుదేరి వెళ్లారు.
Tags: