అజామ్ జాహి భూములపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మావొయిస్ట్ కార్యదర్శి వెంకటేష్
ఆజామ్ జాహి
భూములపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
మావోయిస్టు పార్టీ జయశంకర్ మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి జె యం డబ్ల్యూ పి
డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్
చురకలు విలేఖరి
జగిత్యాల, ఫిబ్రవరి, 03
అజం జాహి మిల్
ప్రస్తుత స్థలంలో కార్మికులభవనాన్ని నిర్మించి ఇవ్వాలని,
భూములపై పూర్తి హక్కు కార్మికులకు లేదా వారి కుటుంబాలకు దక్కే వరకు
విరోచిత పోరాటాలు చేపట్టలని,
ప్రజలు, పత్రికా మిత్రులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కార్మికుల
పోరాటాలకు సంపూర్ణ మద్దతును తెలుపాలని మావొయిస్ట్ పార్టీ జయశంకర్ మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి డివీజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ ఒక ప్రకటనలో కోరారు.
వరంగల్ నగరంలో ఏడు దశాబ్దాల క్రితం ఆజామ్ జాహి వస్త్ర పరిశ్రమను నిజాం కాలంలో స్థాపించారని,ఈ పరిశ్రమపై
ఆధారపడి వేలాది మంది కార్మికులు, ప్రజలు జీవించారని,నేడు మన దేశంలో సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ బూర్జువా వర్గాల దోపిడి
ప్రయోజనాల కోసం 1991లో నూతన ఆర్ధిక విధానాలు చేపట్టి నుండి ప్రభుత్వాలు వస్త్ర పరిశ్రమను ఒక పధకం ప్రకారం నిర్లక్ష్యం చేస్తూ
పరిశ్రమ దివాళా తీసేలా చేశారని . 451 మంది కార్మికులకు బలవంతపు విఆర్ఎస్ ఇచ్చి 2002లో మిల్లును మూసివేశారని,ఫలితంగా కార్మికులు
రోడ్డున పడ్డారని,మూసివేసిన నాటి నుండి నేటి వరకు పరిశ్రమను తిరిగి స్థాపించాలని పోరాడుతూనే వున్నారన్నారు.కార్మికుల పోరాటాన్ని పెడ
చెవిన పెట్టి 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం కుడా సంస్థకు 117 ఎకరాల 20 గుంటలు, ఆంధ్ర ప్రదేశ్ హౌజింగ్ బోర్డుకు 65 ఎకరాలు, రాంకీ,
హ్యూండ్లూమ్ కార్పోరేషన్ సంస్థకు30 ఎకరాల భములను అమ్మేసిందని వెంకటేష్ తెలిపారు.ఈ సంస్థలు కార్మికుల ప్రయోజనాల కోసం, భూములను
పరిరక్షించకుండా ప్రైవేటీ వ్యక్తులకు అమ్మకాల పెట్టాయని, దీనితో కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, పరిశ్రమకు సంబంధించిన
భూమి 226 ఎకరాల భూమిపై న్యాయబద్ధంగా తమకే చెందాలని, ఆ భూములపై కార్మికులకే హక్కు వుండాలిని కార్మికులంతా
పోరాడుతూనే వున్నారన్నారు. ప్రభుత్వ అధికారుల చుట్టూ ఏండ్ల తరబడి తిరిగరన్నారు. అయినప్పటికీ ఈ భూములను కార్మికులకు ఇవ్వకుండా
కార్పోరేషన్ సంస్థలకు వేలం వేశారని, కార్పోరేషన్ సంస్థలకు అమ్మగా మిగులిన భూములను దోపిడి వర్గాలు, రాజకీయ నాయకులు తమ
వ్యాపార ప్రయోజనాల కోసం ప్రభుత్వాల ప్రోద్భలంతో, కొద్దిమంది కార్మిక నాయకుల మద్దతుతో ఓం నమశివాయ, గొట్టే ముక్కుల
నరెందర్ లాంటి కబ్జాదారులు సంబంధిత భూములను కబ్జా చేశారని,కబ్జా పెట్టిన భూములలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టి వాటిని అమ్మకుని
కోట్లు సంపాదిస్తున్నారని, ఆజామ్ జాహి మిల్లు కార్మికులంతా వారి రక్తాన్ని చెమటగా మార్చి పైసా పైసా కూడబెట్టుకొని వారి కష్ట సుకాలను
మాట్లాడుకోవడానికి, తమ హక్కుల కోసం పోరాడడానికి ప్రధాన రహదారి ప్రక్కన వెంకటరామ ధియేటర్ సమీపాన 12 గుంటల భూమిని
కొనుగోలు చేసి కార్మిక భవనాన్ని నిర్మించుకున్నారు. అజాం జహి మిల్లు భూముల వ్యవహారం ఇంకా కోర్టులో వున్నప్పటికీ దానికి సంబంధించిన నియమాలను పట్టించుకోకుండా హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్, వరంగల్ కు సుద్దాల నాగరాజులు తప్పుడు పత్రాలను సృష్టించి ఓం నమశివాయ అనే వ్యాపారికి అక్రమంగా అమ్ముకున్నారన్నారు. వీరి అండతో ఓం నమశివాయ అనే వ్యాపారి కార్మికుల కార్యలయాన్ని అన్యాయంగా కూల్చేశాడని,గతంలో గొట్టె ముక్కుల నరెందర్, ఓమ్ నమశివాయ కార్మికుల భవనాన్ని, భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేసినప్పడు చిక్కుడు ప్రభాకర్ కార్మికుల తరుపున కోర్టులో కేసు వేసి భవనాన్ని, భూములలో జోక్యం చేసుకునే వారిపై చట్ట రిత్యా
చర్యలు తీసుకోవచ్చుని బోర్డు పెట్టించాడన్నారు.అజం జహి మిల్లును తిరిగి తెరిపించాలని కార్మికుల పక్షాన నిలిచి కార్మికోద్యమాలకు నాయకత్వం వహించాడని, నేడు అదే చిక్కుడు ప్రభాకర్ కార్మికులను మోసగించి దోపిడి వర్గాల పక్షం నిలబడుతున్నాడని, గొట్టె ముక్కుల నరెందర్ నుండి ఓం నమశివాయ కు కొలుగోలు చేసినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించాడని ఆరోపించారు. అజం జహి మిల్లుకు సంబంధించిన
భమూములు, భవనానంతో పాటు విలువైన డ్యాక్ మెంట్లను అమ్ముకున్నారని, వరంగల్ కు చెందిన సుద్దాల నాగరాజు అసంఘటి కార్మిక సంఘం పేరుతో చలామణి అవుతూ తినడానికి తిండిలేని స్థితి నుండి సెటిల్ మెంట్స్, భూ అక్రమాలకు పాల్పడి అక్రమంగా ఆస్థులు సంపాదించాడని,
నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అజాం జహి భూముల కబ్జాదారులను శిక్షించకుండా వారి దోపిడి ప్రయోజనాలకు కొమ్ముకాస్తున్నదని,అజం జహి మిల్లు భూములను ప్రవేటీ వ్యక్తులకు అమ్మకానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.కార్మికులు తమ భూమి కోసం చట్ట పరిధిలో న్యాయ పోరాటం చేస్తున్న కార్మికులకు మొండి చెయి చూపి దోపిడి వర్గాలకు అనుకూలంగా వ్యవహరించిందన్నారు.పోలీసు స్టేషన్ లో కేసులు
పెట్టడానికి వెళ్ళితే లంచాలు తీసుకున్న పోలీసులు ఇది మా పరిధిలో లేదని దబాయిస్తూ కేసులు పెట్టడం లేదని,ఫలితంగా 226 ఎకరాల భూమి దురాక్రమణకు గురి అయిందన్నారు.అజాం జహి వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని,ప్రభుత్వం తలపెట్టిన భూముల అమ్మకాన్ని వెంటనే నిలిపి వేయాలని,ప్రభుత్వం న్యాయోచిత చర్యలు చేపట్టి భూములను కార్మికులకు అప్పగించాలని, భవనాన్ని కూల్చి వేతలో, భూ కబ్జాలో ప్రత్యేక్ష్య, పరోక్ష భాగస్వామ్మం వున్న భూ దురాక్రమదారులపై చట్టపర చర్యలు తీసుకోవాలని,ప్రస్తుతం వున్న స్థలంలో కార్మికుల భవనాన్ని నిర్మించి ఇవ్వాలని కోరారు.
ప్రజలు,కార్మికులు అజం జహి మిల్లుకు సంబంధించిన భూములపై పూర్తి హక్కు కార్మికులకు లేదా వారి కుటుంబాలకు వర్తిస్తుందని,ఆ భూములపై హక్కులను సాధించుకునే వరకు విరోచిత పోరాటాలు చేపట్టలని,ప్రజలు, పత్రికా మిత్రులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు కార్మికుల వైపు నిలబడి వారి పోరాటాలకు సంపూర్ణ మద్దతును తెలుపాలని మావొయిస్ట్ కార్యదర్శి
వెంకటేష్ కోరారు