వేరువేరు ఘటనలో ఇద్దరు ఎస్సై లు మృతి

వేరువేరు ఘటనలో ఇద్దరు ఎస్సై లు మృతి

*వేరువేరు ఘటనలలో ఇద్దరు ఎస్‌ఐల మృతి*

తెలంగాణ రాష్ట్రంలోని
మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో రెండు దుర్ఘటనలు చోటుచేసుకుని పోలీస్ డిపార్మెంట్ లో విషాదాన్ని మిగిల్చాయి. మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ-2 గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ (60) గుండెపోటుతో కన్నుమూశారు. ఇక జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతి చెందారు.
మంచిర్యాలలో గుండెపోటుతో ఎస్ఐ మృతి: మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ-2 గా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ (60) తెల్లవారుజామున తన క్వార్టర్లో ఉన్న సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందారు. తానాజీ స్వస్థలం ఉట్నూర్ మండలం, ఎందా గ్రామం... ఆయన అకస్మాత్తుగా మృతి చెందడం సహోద్యోగుల మధ్య తీవ్ర విషాదాన్ని నింపింది.
జగిత్యాలలో రోడ్డు ప్రమాదం ఎస్ఐఐ శ్వేత మృతి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న జగిత్యాల హెడ్క్వార్టర్స్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్వేత తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే ఆమె మృతి చెందింది. శ్వేత గతంలో వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహన దారుడు కూడా మృతి చెందాడు. ఆమె అకాల మరణం పోలీస్ శాఖను శోకసంద్రంలో ముంచేసింది. ఈ రెండు ఘటనలు పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపాయి. శ్వేత, తానాజీ మృతిపట్ల సహోద్యోగులు, కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మరణించిన అధికారుల కుటుంబాలకు పోలీస్ శాఖ సంతాపం తెలిపింది..IMG-20250204-WA0037

Tags:

LatestNews

మరణించిన పోలీసు కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తాం. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారానికి చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
గౌతమ్ మాడల్ స్కూల్ లో గ్రాడ్యుటేషన్ డే వేడుకలు
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఇర్ఫాన్.
జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు. వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్.
ఏసీబీకి చిక్కిన కోరుట్ల ఎస్ఐ. రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు.