విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామని మోసం ఇద్దరి అరెస్ట్ రిమాండ్

విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామని మోసం ఇద్దరి అరెస్ట్ రిమాండ్

విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం.

ఇద్దరు వ్యక్తుల ఆరెస్టు... రిమాండ్ కు తరలింపు..

వివరాలు వెల్లడించిన జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్.

చురకలు ప్రతినిధి, జగిత్యాల,  మార్చి 13 : విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరు వ్యక్తుల అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్
వేణుగోపాల్ తెలిపారు. గురువారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామానికి చెందిన దేశెట్టి రాకేష్ అనే వ్యక్తి జగిత్యాలలోని మల్లికార్జున మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలో అల్లెపు వెంకటేష్ అనే వ్యక్తి విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పగా రూ.3లక్షల 50వేలను 2022లో ఇచ్చాడని, 2023 ఆగస్టులో దేశెట్టి
రాకేష్ ను ఆర్మీనియా దేశానికి ఉద్యోగం నిమిత్తం పంపించగా అక్కడ ఉద్యోగం లేకపోవడంతో 2023 నవంబర్ ఇబ్బందులు పడి స్వదేశానికి పచ్చాడని తెలిపారు. దేశెట్టి రాకేష్ తాను చెల్లించిన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని కోరగా అల్లెపు వెంకటేష్ 2025 జనవరిలో రాకేష్ ను నమ్మించి బ్యాంకాక్క తీసుకెళ్లాడని, బ్యాంకాక్లో సైబర్ క్రైమ్ చేసే
ముఠాకు రాకేష్ ను అప్పగించడంతో ఇతరుల సహాయంలో ఇండియన్ ఎంబసీ సహాకారంలో స్వదేశానికి వచ్చాడని, రాకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లెపు వెంకటేష్, చల్ల మహేష్ లను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు సీఐ వేణుగోపాల్ తెలిపారు.IMG-20250313-WA0110

Tags: