ఇంద్రవెల్లి అమరత్వానికి 44 ఏళ్లు

ఇంద్రవెల్లి అమరత్వానికి 44 ఏళ్లు

ఇంద్రవెల్లి అమరత్వానికి 
44 ఏళ్ళు.

కాలిన కడుపున
రాలిన కన్నీళ్ల మాటున 
నడిచిన దారిలో 
చరిత్ర మాటున గాయాలెన్నో.
ఇంద్రవెల్లి మానని  గాయం 
 అడవి బాటలో 
ఎరుపెక్కిన గ్రామాలు 
 బిగించిన పిడికిల్లలో
 ఎత్తి పట్టిన త్యాగాల జెండాలు
 ఇంద్రవెల్లి మానని గాయం.
 ఒళ్ళు విరుచుకున్న విల్లంబులు
 తోక ముడిచిన దోపిడీ 
పారిపోయిన దళారి వ్యవస్థతో
అడవి బిడ్డలకు ఆకలి తీరిన
 ఇంద్రవెల్లి మానని గాయం.
అడవి బిడ్డల ఆవేశంతో 
ప్రశ్నించిన గొంతులు
 రేలా పాటలు తుడుం మొతలు 
పచ్చని పంటల్లో ఒడిసెల విసురులు 
 ఇంద్రవెల్లి మానని గాయం.
 రాజ్యం ఉలిక్కి పడ్డది
 కల్లోలం సృష్టించింది
 అంగడి జాత్రలో తూట పేలింది 
 చెట్టు పుట్ట పై నెత్తురు
 రాలి కన్నీరు కార్చింది 
ఇంద్రవెల్లి మానని గాయం
బిర్సా ముండ వారసులు 
కొమరం భీమ్ పోరు బిడ్డలు
 దండకారణ్యం దారుల్లో
 గర్జించిన నక్సల్బరి 
అల్లూరి బిర్స ముండా 
చారు బాబు దాదాల
పోరు కేకలు
ఇది ఆగని ఆరని అలసిపోని 
ఆకలి పోరాటం వర్గ పోరాటం 
 ఇంద్రవెల్లి నుండి దండకారణ్యo కు
చిందుతున్న రక్తం తో 
త్యాగల నేల చిగురిస్తూనే ఉంటుంది.
 @బాలసాని రాజయ్య
9441970025IMG-20250419-WA0060

Tags: