గోండు గూడెం లో నేలకొరిగిన "గోల్డ్ మెడల్ 'లా' గుమ్మడి రేణుక"
గోండు గూడెం లో నేలకొరిగిన "గోల్డ్ మెడల్ 'లా' గుమ్మడి రేణుక"
దొడ్డి కొమరయ్య ధైర్యం, ఎర్రం సంతోష్ రెడ్డి వారసత్వం
మావోయిస్టు పార్టీ పత్రికలకు ఆమె ఎడిటర్ కూడా.!!
నేడు కడవెండిలో మావో అగ్రనేత్రికి అంతిమ వీడ్కోలు,
చురకలు ప్రత్యేక ప్రతినిధి
చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ లో కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఖగర్ సైనికుల చేతిలో మరణించిన మహిళా మావోయిస్టు నాయకురాలు ముందుగా ఆమె సోమయ్య సార్ బిడ్డ, ఉపాధ్యాయురాలు కూతురు.. గూడ్స్ వుసెండి జీవీకే ప్రసాద్ చెల్లెలు.. ఉన్నత చదువుల ఆడబిడ్డ, ఎల్.ఎల్.బి వరకు చదువుకున్నారు తిరుపతిలో ఎల్ఎల్బి పూర్తి చేసి అక్కడే న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. ఆమె జీవితానికి కావలసినవి సుఖ సంతోషాలు గడిపేందుకు అన్ని అవకాశాలను కుటుంబం నుండి వాటిని వదులుకొని పేద ప్రజల కోసం అడవి బాట పట్టిన ఆడబిడ్డ నేలకొరిగిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. కడవెండి గ్రామంలో పద్మశాలి కుటుంబం నుండి పుట్టిన రేణుక ఈ దేశం నిరుపేదలపై దొరల దౌర్జన్యాలు, పీడిత ప్రజలపై నీయంత పాలన ఎదిరించి ఉన్నత చదువులు ఆడబిడ్డ 30 ఏళ్లకు పైగా ఆ పార్టీలో వివిధ హోదాల్లో పని చేశారు తెలంగాణలో ఆమెపై 20 లక్షల అవార్డు చతిస్గడ్లో ఆమెపై 25 లక్షల రివార్డు ప్రభుత్వాలు ప్రకటించాయి. విప్లవ సాహిత్యంలో వచ్చే అనేక పత్రికలకు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. తోడబుట్టిన అన్నస్ఫూర్తితో అడవి బాట పట్టిన రేణుకను అక్కడే వదిలి అన్న సరెండర్ అయ్యారు. పార్టీలో వివాహమాడిన శాఖమూరి అప్పారావు ఎన్కౌంటర్లో మరణించారు. అయినప్పటికీ ఉద్యమం నుండి వెనితిరుగకుండా నమ్ముకున్న సిద్ధాంతం కోసం అడవి బాట వీడలేదు ఆదివాసుల మధ్యనే తన జీవితం అనుకున్నది కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కగార్ సైనికుల తుపాకి తూటాలకు అక్కడే అశువులు బాషారు. వెంట నడిచిన లేకపోయినప్పటికీ గుండె ధైర్యంతో మావోయిస్టు పార్టీలో కొనసాగిన రేణుక ఒక గొప్ప కవిగా అనేక పుస్తకాలు రాశారని చెబుతున్నారు. ఇంకా రేణుక గురించి కడివెడ్డి ప్రజలు చెప్పిన వివరాలు..
చత్తీస్ గడ్ లో ఈరోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ ముఖ్య నాయకురాలు మరణించారు.
ఎన్ కౌంటర్ మృతురాలి గుర్తింపు ఎస్పీ గౌరవ్ రాయ్ వెల్లడించారు
దంతేవాడ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందిన మహిళా మావోయిస్టు గుర్తింపు చేయగా,
దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ చైతు అలియాస్ సరస్వతిగా గుర్తించారు.
చైతుది వరంగల్ జిల్లా కడవెండి గ్రామం ఆమె 30 ఏళ్ల క్రితం పార్టీలో వెళ్లారు.
మృతురాలి స్వస్థలం వరంగల్ జిల్లా కడవెండి నివాసి
ఛత్తీస్ ఘడ్ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు రేణుక అలియాస్ చైతు అలియాస్ సరస్వతిగా గుర్తింపు....
ఎల్ ఎల్ బి చదివిన తిరుపతి లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ, అటు మహిళా సంఘం లో పనిచేస్తూ అప్పటి,ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అలిపిరి దాడి అనంతరం రేణుక@ చైతు మావోయిస్టు పార్టీలోకి పూర్తిస్థాయి కార్యకర్తగా వెళ్లినట్టు తద నంతరం ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డిని వివాహం చేస్తుందని ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు నేత శాఖమూరి అప్పారావు సహచరీనీగా కొనసాగుతూ విప్లవోద్యమంలో స్పెషల్ జోనల్ కమిటీ నంబర్ గా ప్రస్తుతం కొనసాగుతున్నట్లు తెలుస్తుంది.35 ఏళ్ల క్రితం పార్టీలో వెల్లిన రేణుక తండ్రి సోమయ్య (సార్)ఉపాధ్యాయుడిగా పనిచేసే పదవి విరమణ చేశారు. తనకు ఇద్దరు సోదరులు ఉన్నారు ఒక సోదరుడు గుమ్మడి వెళ్లి రాజశేఖర్ న్యాయవాదిగా పనిచేస్తూ ఒక స్వచ్ఛంద సంస్థకు లీగల్ అడ్వైజర్ గా కొనసాగుతున్నట్టు సమాచారం. మరొక సోదరుడు గుమ్మడవెల్లి వెంకట కిషన్ ప్రసాద్@పూసండి ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో బి బి సి(తెలుగు) లో జర్నలిస్టుగా పనిచేస్తున్నట్టు సమాచారం. గతంలో ఇతను కూడా మావోయిస్టు అగ్రనేతగా పనిచేసే అనారోగ్య కారణాల వల్ల ప్రభుత్వానికి లొంగిపోయిలొంగిపోయినట్లు తెలిసిందికడవెండి గ్రామం అంటేనే రజాకార్లకు సైతం గుండెల్లో వణుకు పుట్టించిన గ్రామం విప్లవాల ఖల్లా గా పేరుంది. రేణుక ఆ విప్లవకారుల వారసత్వాన్ని పునికి పుచ్చుకొని విప్లవోద్యమంలో కడవరకు కొనసాగారు.మరణంతో కడవెండి గ్రామం లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కడవండి గ్రామం నుంచి రేణుక తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాదులోని నాగారంలో ఉంటున్నట్టు సమాచారం తన మృతదేహాన్ని తీసుకురావడానికి వాళ్లు కుటుంబ సభ్యులతో కలిసి చతిస్గడ్ వెళ్తున్నట్టు తెలిసింది. వీళ్ళ కుటుంబం ఆదర్శ బావాలు గల కుటుంబంగా పేరుంది మీరు మేనమామ సైతం రవి అజ్ఞాతంలో ఉన్నట్టు తెలుస్తుంది...
గుమ్మడివెల్లి రేణుక ఇంకా చెప్పాలంటే భాను అలియాస్ చైతే అలియాస్ సరస్వతి అలియాస్ దమయంతి పేర్లతో కొనసాగారు.
సెంట్రల్ రీజినల్ బ్యూరో, ప్రెస్ టీం ఇన్‌చార్జ్, ఎడిటర్ ప్రభాత్ పత్రిక, డికే జడ్ సి యం మహిళా మావోయిస్టు 1996లో నక్సల్ సంస్థలో చేరి ఆంధ్రప్రదేశ్‌లోని స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కృష్ణ అన్నతో కలిసి పనిచేసింది.
2003లో డివీసీమ్ పదవికి పదోన్నతి పొందారు. 2006లో సౌత్ బస్తర్‌లో సీసీమ్ దుల్లా దాదా అలియాస్ ఆనంద్‌తో కలిసి పనిచేశారు. 2013లో మాడ్ ప్రాంతానికి వచ్చి ఎస్ జడ్ సి రామన్నతో కలిసి పనిచేశారు. 2020లో కరోనా కారణంగా రామన్న మరణించిన తర్వాత, డీకేసజసీఎం, సెంట్రల్ రీజినల్ బ్యూరో ప్రెస్ టీం ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు.
నక్సల్ సంస్థ తరపున పత్రికా ప్రకటనలను జారీ చేసేది మరియు ప్రభాత్, మహిళా మార్గం, అవామి జంగ్, పీపుల్స్ మార్చ్, పోడియారో పోల్లో, ఝంకార్, సంఘర్ష్టర్ మహిళా, పితురి, మిడంగూర్, భూమ్కల్ సందేశ్ వంటి వివిధ పత్రికలను ముద్రించి ప్రచురించేది.
రేణుక,, చేతే గ్రామమే విప్లఉద్యమానికి నాటి రజా కారులను ఎదిరించిన గ్రామం.. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దొరల దౌర్జన్యాల పాలనకు ఎదురు తిరిగిన గ్రామం.. ఆ గ్రామం నుండి ముందుగా రజక కుటుంబం నుండి చదువుకున్న బిడ్డ పైండ్ల, వెంకటరమణ. 1986 లో అమరుడయ్యారు.పీజీ గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి నాయకుడు పీపుల్స్ వార్ పార్టీకి రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కొనసాగుతూ కొయ్యూరు ఎన్కౌంటర్లో మరణించిన నలుగురులో ఒకరైన
ఎర్రం రెడ్డి, సంతోష్ రెడ్డి అదే గ్రామానికి చెందినవారు. నాటి రజాకార్ల చరిత్ర నుండి కడివిoడి చరిత్ర సంతోష్ రెడ్డి తో మరోసారి చరిత్ర పేజీలోకి ఎక్కింది. అదే గ్రామం నుండి ఇద్దరు సోదరులు మావోయిస్టు పార్టీలో చేరి ప్రజల కోసం తమ విలువైన ప్రాణాలను
పెద్ది, శ్రీనివాస్ గౌడ్.
పెద్ది, యాదగిరి గౌడ్. లు అర్పించారు. ఇప్పుడు వారి వారసత్వంగానే అమరుల ఆశయ సాధనలో
గుమ్మడవెల్లి, రేణుక అలియాస్ అరుణక్క చేరారని కడివిoడి గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు.