అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.
జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 23 : అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం ప్రభుత్వం పని చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల పట్టణంలోని ముస్లిం కమ్యూనిటి హాల్, రాయల్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే హజరై ముస్లింలకు ఖర్జురా తిన్పించి ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో మైనార్టీల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరు తమ మతాన్ని ప్రేమిస్తూనే ఇతర మతాలను గౌరవించాలన్నారు. జగిత్యాల నియోజకవర్గంలోని మసీదులు, ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించానని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎండబ్ల్యు చత్రు, తహసీల్దార్ రామ్మోహన్, డిఎస్పీ రఘుచందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం. నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్, ఆడువాల లక్ష్మణ్, ఖాజీం అలీ, సలావోద్దీన్ మున్నా, ఖాజా హసీబోద్దీన్, దుమాల రాజ్కుమార్,మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.