స్నేహపురిత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి ఏసీపీ శ్రీనివాస్ జి
*స్నేహపూరితమైన వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి*
*హుజురాబాద్ ఎసిపి శ్రీనివాస్ జి*
చురకలు విలేఖరి
హుజురాబాద్, మార్చి, 28
భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని,దేశంలోని విభిన్న కులాలు,మతాలవారు రాబోయే పండుగలు అన్ని కులమతాలకు అతీతంగా స్నేహపూర్వకమైన వాతావరణంలో జరుపుకోవాలని హుజురాబాద్ ఎసిపి శ్రీనివాస్ జి తెలిపారు, ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాబోయే ఉగాది,రంజాన్,శ్రీరామనవమి పండుగలు ప్రజలందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని అన్నారు,హుజురాబాద్ డివిజన్ లో ప్రజలందరూ పండుగలను కులమతాల అతీతంగా కలిసిమెలిసి జరుపుకొని అందరికీ ఆదర్శంగా నిల్వాలన్నారు,గతంలో మాదిరిగానే కులమతాలతో సంబంధం లేకుండా పండుగలు జరుపుకోవాలని,పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు,ప్రజలందరికీ పోలీసులు సహకారాలు అందిస్తూ మద్దతుగా ఉంటారని తెలిపారు
అనంతరం హుజురాబాద్ ఎసిపి శ్రీనివాస్ జి కు మరియు హుజరాబాద్ సిఐ తిరుమల్ గౌడ్ కు జామే మజీద్ ఈద్గా అండ్ కబరస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఏక్ మినార్ అధ్యక్షుడు జలాలుద్దీన్ అక్బర్,మక్కా మసీద్ అధ్యక్షుడు సయ్యద్ అజీమ్,మస్జిద్-ఎ-బషీర్ అధ్యక్షుడు ఫయాజ్, మస్జిద్-ఎ-కౌసర్ అధ్యక్షుడు ఇస్మాయిల్, జమాతే ఉలేమా అధ్యక్షుడు మిర్జా ఇమ్రాన్ బేగ్ మరియు ముస్లిం నాయకులు పాల్గొన్నారు