సిసి కెమెరాల కేబుళ్లను ధ్వసం చేసిన వ్యక్తులపై కేసు నమోదు

సిసి కెమెరాల కేబుళ్లను ధ్వసం చేసిన వ్యక్తులపై కేసు నమోదు

సిసి కెమెరాల కేబుళ్లను ధ్వంసం చేసిన వ్యక్తులపై కేసు నమోదు.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 24: జగిత్యాల పట్టణంలో పలు ప్రధాన చౌరస్తాల వద్ద ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ధ్వంసం చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు జగిత్యాల పట్టణ పోలీసులు తెలిపారు. సోమవారం వారు తెలిపిన వివరాల ప్రకారం  జగిత్యాల పట్టణంలో 2023లో జగిత్యాల మున్సిపాలిటీ వారు టియుఎఫ్ఐడీసీ నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను, 2024 జులై నెలలో కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా జగిత్యాల పట్టణంలోని ఐఎంఏ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సామాజిక బాధ్యత గల సంస్థల వద్ద నుండి సీసీ కెమెరాల కొరకు సేకరించిన నిధులతో మరమ్మతులు చేసి జగిత్యాల పట్టణంలోని పలు చౌరస్తాలలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు వాటికి సంబంధించిన కేబుళ్లను జగిత్యాల టౌన్ పోలీస్ వారికి ఎలాంటి సమాచారం లేకుండా జగిత్యాల పట్టణ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఎలక్ట్రికల్ విభాగంలో  సిబ్బంది నక్క భూమరాజ్, జాకి అనే వ్యక్తులు పాత బస్టాండ్, లడ్డు ఖాజా, బాలాజీ థియేటర్, న్యూ బస్టాండ్, ఆర్డీఓ చౌరస్తా, తీన్ ఖని మరియు మంచినీళ్ళ బావి ఏరియాలో ఉద్దేశపూర్వకంగా  సీసీ కెమెరాల సంబంధించిన ఫైబర్ కేబుళ్లను సుమారు రూ. 60 వేల నష్టం కలగజేసే విధంగా కట్ చేసి వాటిని ధ్వంసం చేసి వాటిని పనిచేయకుండా చేశారు.ఈ విషయం  పోలీసులు శాఖ దృష్టిలోకి రాగ ఏమైందని తెలుసుకోగా సదరు మున్సిపల్ సిబ్బంది జగిత్యాల మున్సిపల్ లో పనిచేస్తున్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ అనిల్ ఆదేశాల మేరకే మేము కట్ చేశానని చెప్పడంతో, ఈ విషయాన్ని తెలుసుకున్న జగిత్యాల టౌన్ పోలీస్ సదరు మున్సిపల్ ఏఈ అనిల్,  సిబ్బంది నక్క భూంరాజ్, జాకీ ఇద్దరు వ్యక్తులపై జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు
జగిత్యాల టౌన్ పోలీసులు తెలిపారు.Screenshot_20250323_091151_Google

Tags: