*నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం: డీఎస్పీ రఘు చందర్
*నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం:
డీఎస్పీ రఘు చందర్
ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి*
చురకలు విలేఖరి
జగిత్యాల, మార్చి, 21
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేరాలను కట్టడి చేయవచ్చని జగిత్యాల డిఎస్పి రఘు చందర్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రార్థన మందిరాల్లో దొంగతనాల నివారణ గురించి జిల్లా పోలీసుల విజ్ఞప్తి మేరకు ఈరోజు బుగ్గారం మండలంలోని యశ్వంతరావుపేట గ్రామంలో గల ఖుబ మసీద్ నందు ఏర్పాటుచేసిన 10 సీసీ కెమెరాలను ముస్లిం కమిటీ పెద్దలతో కలసి డిఎస్పి రఘు చందర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం ద్వారానే నేర రహిత సమాజ నిర్మాణం సాధ్యమని,నేరాల నియంత్రణ, శాంతి భద్రతలు కాపాడేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు తదితర ఘటనలు జరిగిన పరిస్థితుల్లో సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించి పట్టుకోవడానికి పోలీసులకు మూడో నేత్రంగా ఉపయోగపడుతుందన్నారు.
బుగ్గారం మండలంలోని ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు లో ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.ఈ యొక్క సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో కృషి చేసిన వారిని డీఎస్పీ అభినందించారు.
అనంతరం మసీద్ కమిటీ సభ్యులచే ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ధర్మపురి సి.ఐ రాం నరసింహారెడ్డి మరియు ఎస్.ఐ శ్రీధర్ రెడ్డి, మసీద్ కమిటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.