రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను సందర్శించిన డీఎస్పీ రాములు

రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను సందర్శించిన డీఎస్పీ రాములు

*రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్ ప్రదేశాలను సందర్శించిన డి.ఎస్.పి రాములు*

చురకలు ప్రతినిధి,కోరుట్ల మార్చ్,23,::-- జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన *సురక్షిత ప్రయాణం* కార్యక్రమం భాగంగా, మెట్ పల్లి డీఎస్పీ రాములు కోరుట్ల, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవే 63 లో ప్రమాదకర ప్రాంతాలను (బ్లాక్ స్పాట్) లను పరిశీలించారు.
*సందర్శించిన ప్రధాన ప్రమాద ప్రదేశాలు:*

ఎస్ ఎఫ్ ఎస్, నంది చౌరస్తా, బస్టాండ్ ఏరియా,
మాదాపూర్ ఎక్స్ రోడ్, గుమ్లాపూర్ విలేజ్ ఎక్స్ రోడ్, మోహన్ రావు పెట్ ఎక్స్ రోడ్, మేడిపల్లి పోలీస్ పరిధిలోని
ఎల్లమ్మ టెంపుల్, సురభి రైస్ మిల్, డాంబర్ ప్లాంట్, పి ఎన్ ఆర్ గార్డెన్ ఏరియా  లను సందర్శించి మున్సిపల్, ఆర్ అండ్ బి, నేషనల్ హైవే అథారిటీలతో సమన్వయం చేసుకొని రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని ప్రజల విలువైన ప్రాణాలు కాపాడాలని ఆదేశించారు.

*చేపట్టిన ముఖ్య చర్యలు*:

ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు.
స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు కోసం తగిన సూచనలు ఇచ్చిన డి.ఎస్.పి రాములు.
ఈ చర్యలు రోడ్ ప్రమాదాలను తగ్గించడానికి, ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడానికి తీసుకుంటున్నామని సురక్షిత ప్రయాణం కార్యక్రమం ప్రజల రోడ్ భద్రతను మెరుగుపరిచేలా ఉంటుందని  తెలిపారు.
ఈ సందర్భంగా డిఎస్పి రాములు మూల మలుపుల వద్ద వాహనాలు నడిపే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు:

*ప్రధాన జాగ్రత్తలు*:

1. వేగాన్ని తగ్గించాలి – మూల మలుపులకు సమీపిస్తున్నప్పుడు వాహన వేగాన్ని తగ్గించి నెమ్మదిగా వెళ్లాలి.

2. హెచ్చరిక బోర్డులను గమనించాలి – మలుపుల వద్ద ఏర్పాటు చేసిన సైన్‌బోర్డులు, హెచ్చరిక సూచనలను పాటించాలి.

3. హార్న్ ఇవ్వాలి – ముందు వెనుక వాహనదారులకు స్పష్టమైన సంకేతం ఇచ్చేందుకు హార్న్ వాయించాలి.

4. ఓవర్‌టేక్ చేయకూడదు – మలుపు ప్రాంతాల్లో ఓవర్‌టేక్ చేయడం ప్రమాదకరం కాబట్టి, దీన్ని పూర్తిగా నివారించాలి.

5. స్పీడ్ బ్రేకర్లను గమనించాలి – మలుపులకు ముందుగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లను గమనించి, జాగ్రత్తగా వెళ్లాలి.

6. హెడ్లైట్లు & ఇండికేటర్లు వాడాలి – రాత్రి సమయంలో హెడ్లైట్లు ఉపయోగించి, అవసరమైన చోట ఇండికేటర్లు చూపించి ప్రయాణించాలి.

7. డ్రైవింగ్‌లో అప్రమత్తంగా ఉండాలి – మొబైల్ ఫోన్ వాడకూడదు, దృష్టి మరలకుండా జాగ్రత్తపడాలి.
ఈ సూచనలు పాటించడం ద్వారా రోడ్ ప్రమాదాలను తగ్గించుకోవచ్చని, ప్రయాణం సురక్షితంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందని డీఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, కోరుట్ల ఎస్సై రామచంద్రం, మేడిపల్లి ఎస్సై శ్యామ్ రాజ్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.IMG-20250323-WA0075

Tags: