గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు. నిందితుల వద్ద నుండి 450 గ్రాముల గంజాయి స్వాధీనం. వివరాలు వెల్లడించిన మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి
గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు.
నిందితుల వద్ద నుండి 450 గ్రాముల గంజాయి స్వాధీనం.
వివరాలు వెల్లడించిన మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి
చురకలు విలేకరి, మెట్ పల్లి, మార్చి 15 : గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్టు చేసి నిందితుల వద్ద నుండి 450 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నామని మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. శనివారం మెట్పల్లి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని శాంతినగర్ లోని ఓ ఇంట్లో కొందరు వ్యక్తులు గంజాయి సేవిస్తున్నారని సమాచారం రావడంతో ఎస్ఐ కిరణ్ కుమార్, సిబ్బందితో కలసి దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో బీహర్కు చెందిన రూపేష్ కుమార్,
సునీల్ కుమార్, చోటు కుమార్, సంతోష్ కుమార్లు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. నిందితులు బీహర్ రాష్ట్రం నుండి గంజాయి తీసుకవచ్చి మెట్పల్లి, మల్లాపూర్ పరిసరా ప్రాంతాల్లో చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల వద్ద నుండి 450 గ్రాముల గంజాయి, ఓ వాహనాన్ని, నాలుగు ఫోన్లను స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించిన యువకులకు సీఐ కృతజ్ఞతలు తెలిపారు. గంజాయి సరఫరా చేస్తున్న, విక్రయిస్తున్న, సేవిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా
ఉంచుతామన్నారు. ఈ సమావేశంలో మెట్పల్లి ఎస్ ఐ కిరణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.