భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు.  జగిత్యాల  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.

భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు.

జగిత్యాల  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్.


చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 22 : కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి చిన్న హనుమాన్ జయంతి బ్రహ్మోత్సవాల సందర్బంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శనివారం జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి చిన్న హనుమాన్ జయంతి బ్రహ్మోత్సవాలు సందర్భంగా సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులతో సమీక్షించి ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఏప్రిల్  11 నుండి 13 వరకు జరిగే చిన్న హనుమాన్ జయంతి ఏర్పాట్లు పై కలెక్టర్ స్వయంగా అధికారులతో కలిసి భక్తులకు స్నానమాచరించే పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బంది కలగకుండా లైట్స్, చలవ పందిర్లు ఏర్పాటు చేయాలన్నారు. త్రాగునీరు, మొబైల్ టాయిలెట్స్ , ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.ఆలయ ప్రాంగణం ఆలయ పరిసరాలలో నిత్యం శానిటేషన్ నిర్వహించాలని తెలిపారు. భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు లను సిద్దం చేయాలని ఆయా శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంజి ల్లా ఎస్పీ అశోక్ కుమార్,  జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డిపిఓ మదన్ మోహన్, డీఎస్పీ రఘుచందర్, సీఐ నీలం రవి, ఎస్ఐ నరేష్, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు టెంపుల్ ఈఓ, మిషన్ భగీరథ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.IMG-20250322-WA0078

Tags: