ప్రయాణం మరింత సురక్షితం. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక చర్యలు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్..

ప్రయాణం మరింత సురక్షితం.   రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక చర్యలు.   జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్..

ప్రయాణం మరింత సురక్షితం.


రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక చర్యలు.


జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.

ట్రాఫిక్ నియంత్రణ భద్రత సామాగ్రి, బ్రీత్ అనలైజర్ పరికరాల అందజేత.


చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఏప్రిల్ 3: రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో, ట్రాఫిక్ నియమాలను మరింత పకడ్బందీగా  అమలుపర్చడానికి రాష్ట్ర డిజిపి కార్యాలయం నుంచి వచ్చిన ఆధునాతన పరికరాలు ఫ్లెక్సబుల్ ఐరన్ బారికేడ్స్ , ట్రాఫిక్ కోన్స్,రిఫ్లెక్ట్ జాకెట్స్, బ్రీత్ అనలైసర్స్, ఎల్ఈడి బటన్స్, బొల్లార్డ్స్, రేడియం టేప్ రోలర్స్, డిజిటల్ వీడియో కెమెరాస్, ఫోల్డెడ్ బారికెట్స్, పరికరాలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గురువారం జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో వివిద పోలీస్ స్టేషన్ల అదికారులకు అందజేశారు. 
ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా లో ట్రాఫిక్ నియమాలను మరింత పకడ్బందీగా అమలు పరచడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు అధునాతన ట్రాఫిక్ పరికరాలను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. కాలానుగుణంగా పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి , ప్రజలు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరడానికి మరియు ట్రాఫిక్,  పోలీస్ సిబ్బంది ఎఫెక్టివ్ గా విధులు నిర్వహించడానికి ఈ ట్రాఫిక్ పరికరాలు ఎంతగానో ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. రోజు వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. అదే విదంగా బందోబస్తు సమయంలో ఫ్లెక్సబుల్ ఐరన్ బారికేడ్స్ ఎంత ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డిఎస్పిలు రఘు చంధర్, రాముల, రంగారెడ్డి, డిసిఆర్బీ,  ఎస్బి, సీసీఎస్, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్, ఆరిఫ్అలీఖాన్, శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.IMG-20250403-WA0087

Tags: