ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం

ఏసీపీ కార్యాలయాన్ని సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం

IMG-20250320-WA0085ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ గౌష్ ఆలం, 
చురకలు ప్రతి నిధి
కరీంనగర్, మార్చి, 20

కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని రూరల్ డివిజన్ ఏసీపీ కార్యాలయాన్ని బుధవారంనాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం   సందర్శించారు. డివిజన్ పరిధి అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలో గల పెండింగ్ కేసులపై సమీక్ష చేసారు. వాటికి గల కారణాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. అర్బన్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. 
 రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు. 
సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నందున, వాటి బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. పెండింగ్ వారెంట్ల అమలు చేయాలన్నారు. 
రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ హోల్స్ గా గుర్తించి, రోడ్డు ప్రమాదాల నివారణకై చర్యలు చేపట్టాలన్నారు.
గంజాయి రవాణా, అక్రమ ఇసుక  రవాణా మరియు పి.డి.ఎస్. బియ్యం,  పేకాట స్థావరాలను గుర్తించి ఆడేవారిని పట్టుకోవడం,  వంటి వాటిని గుర్తించి తగిన కేసులు నమోదు చేసి, వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు.
ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్ ఐపిఎస్ తో పాటు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.IMG-20250320-WA0085

Tags: