వాక్ఫ్ బోర్డు బిల్లు వెనక్కి తీసుకోవాలి

*వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి.మెట్ పల్లి మర్కజి ఇంతేజామీ కమిటీ మిల్లతే ఇస్లామీయ మాజీ అధ్యక్షుడు ఖుతుబొద్దీన్ పాషా*
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని మెట్ పల్లి మర్కజి ఇంతేజామీ కమిటీ మిల్లతే ఇస్లామీయ మాజీ అధ్యక్షుడు ఖుతుబొద్దీన్ పాషా డిమాండ్ చేశారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు శుక్రవారం నమాజ్ అనంతరం నల్ల రిబ్బన్ ధరించి శాంతియుత నిరసన తెలిపారు.అంతకుముందు బిల్లును వెనక్కి తీసుకునేలా మజీద్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వక్ఫ్ సవరణ బిల్లు వల్ల ముస్లిం సమాజానికి, మస్జీద్ లకు, మదరసాలకు, ఖభరస్తాన్ లకు, ముస్లిం సమాజం యొక్క మతపరమైన స్వేచ్చకు నష్టం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశ పెట్టిందని ఈ బిల్లు వల్ల ముస్లిం సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోతుందని ఈ బిల్లును వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోమైనారిటీ మండల అధ్యక్షులు మహమ్మద్ యాసీన్ ,అబ్దుల్ ఇమ్రాన్ మహమ్మద్ అఫ్రోజ్ మరియు మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు