మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన కార్యక్రమం.
By: Mohammad Imran
On
మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన కార్యక్రమం.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, ఏప్రిల్ 3 : తెలంగాణ యాంటీ నారోటిక్ బ్యూరో డైరెక్టర్ సూచనల మేరకు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకూడురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మాదకద్రవ్య వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాంటీ నారోటిక్ బ్యూరో డిఎస్పీ,ఎస్, ఉపేందర్, ఇన్స్ పెక్టర్ కృష్ణ మూర్తిలు
విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాలకు చెందిన విద్యార్థిని సమన్విని మాదకద్రవ్య వ్యతిరేక పోస్టర్ ను రూపోందించడం పట్ల అభినందించి, ఆర్ఎన్పీసి కరీంనగర్ ఆధ్వర్యంలో ప్రశంసపత్రం, నగదు పారితోషికం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి కె. రాము. సెక్టోరియల్ అధికారి రాజేష్, ప్రధానోపాధ్యాయురాలు ప్రశాంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Tags: