నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యం. టీజీఎన్పిడిసిఎల్ ఎస్ఈ సాలియా నాయక్.

నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యం.


చురకలు ప్రతినిధి, జగిత్యాల, మార్చి 26: 
వినియోగదారులకు మరింత మెరుగైన , నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే లక్షంగా జగిత్యాల సర్కిల్ పరిధిలో కెపాసిటర్ బ్యాంకులు 115 అమర్చినట్లు సూపెరిండెంట్ ఇంజనీర్ సాలియా నాయక్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు లైన్లలో కెపాసిటర్ బ్యాంకులు 41 అమర్చినట్లు, వోల్టేజ్ లో హెచ్చు తగ్గులు లేకుండా ఎంతగానో కెపాసిటర్ బ్యాంకులు ఉపయోగపడుతాయన్నారు. కెపాసిటర్ బ్యాంకులు పెట్టడం వలన సబ్ స్టేషన్ , లైన్లలో విద్యుత్ సరఫరాలో ఓవర్ లోడ్ కాకుండా నియంత్రిస్తున్నదన్నారు . సబ్ స్టేషన్ లలో వన్  ఎం విఏఆర్, టూ ఎం విఏఆర్ కెపాసిటర్లు పెడుతున్నామని, అలాగే 11 కెవి లైన్లలో 600 కెవిఆర్ కెపాసిటర్లు అమర్చడం వలన పవర్ ఫాక్టర్ మెరుగు పడుతుందన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు, పారిశ్రామిక ఫీడర్లలో వోల్టేజ్ వలన మోటార్లు కాలిపోకుండా ఉండేందుకు కెపాసిటర్ బ్యాంకులు దోహదపడుతాయన్నారు. విద్యుత్ సరఫరా వ్యవస్థలో రీయాక్టివ్ పవర్ కాంపన్సేషన్ ద్వారా  పవర్ ఫ్యాక్టర్ గణనీయంగా మెరుగు పరచడానికి కెపాసిటర్ బ్యాంకులు దోహద పడుతున్నాయన్నారు. టెక్నికల్ నష్టాలు ఘననీయంగా తగ్గుతాయని, పరికరాల మన్నిక కూడా చాల కాలం పెరుగుతుందన్నారు. పారిశ్రామిక వినియోగదారులకు కెపాసిటర్లు పెట్టుకోవడానికి ప్రోత్సహిస్తున్నామన్నారు. వీటివలన ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ భారం తగ్గి మోటార్లు కాలిపోకుండా మన్నిక పెరుగుతుందని తెలిపారు.వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే కంకణ బద్ధులై పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

Tags: