ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం

ధర్మపురి పండితులకు అరుదైన గౌరవం
.........................................
రామ కిష్టయ్య సంగన భట్ల...
  9440595494
.............................
ఉగాది పర్వ దినం సందర్భంగా ధర్మపురి క్షేత్రానికి చెందిన లబ్ద ప్రతిష్టులైన పండితులు సన్మానాలు సత్కారాలు పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటినుండి ఏటా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది పర్వదిన వేడుకల సందర్భంగా రాష్ట్ర రాజధానిలో క్రమం తప్పకుండా పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ధర్మపురి వాస్తవ్యులైన పండితునికి అరుదైన అవకాశం, గౌరవం లభించాయి. శృంగేరీ మహా సంస్థాన ఆస్థాన పౌరాణికులు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి శిష్యులు, దేశ, విదేశాలలో ప్రవచనాలు చేస్తూ, లబ్దప్రతిష్టులైన బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఈ సందర్భంగా వరుసగా తొమ్మిదవ సారి పంచాంగ పఠనం చేసి,  సన్మానితులయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. 

అలాగే ధర్మపురి మరో పండితుడికి మరో అవకాశం దక్కింది. ఉగాది పర్వదినం సందర్భంగా ధర్మపురికి చెందిన ప్రముఖ జ్యోతిష, వాస్తు పండితులు , బ్రహ్మశ్రీ పాలెపు రాజేశ్వరశర్మ సిద్దాంతి విశ్వావసు నామ సంవత్సర నూతన పంచాంగాన్ని తెలంగాణ భవన్ లో పఠనం చేశారు.
అనంతరం రాజేశ్వర శర్మ భారాస నేతలకు ఆశీర్వచనం అందించారు.
బిర్లా టెంపుల్ లో పంచాంగ కర్త సంగన భట్ల నరసింహ మూర్తి సిద్ధాంతి పంచాంగ పఠనం గావించి, సన్మానితులైనారు.

గాయత్రి సత్రంలో పండిత సన్మానం

శ్రీ గాయత్రి బ్రాహ్మణ నిత్యాన్న దాన సత్రంలో పండిత సన్మాన కార్యక్రమం నిర్వహించారు. విశ్రాంత పండితులు ఒజ్జల నరహరి శర్మ, తాడూరి బలరాం శర్మ,   సంగన భట్ల రామ కిష్టయ్య జర్నలిస్ట్ (నటన), లకు ఘనంగా సన్మానాలు గావించారు. అద్యక్షులు డాక్టర్ కొరిడె దత్తాత్రి ప్రధాన కార్యదర్శి అంబరీషా చార్య, కార్యవర్గ సభ్యులు, ముఖ్యులు పాల్గొన్నారు.

ధర్మపురి క్షేత్రం లో దేవస్థానంలో  నిర్వహించిన ఉగాది వేడుకలలో భాగంగా, పెండ్యాల చంద్ర శేఖర్ శర్మ (వేదం), కాకర్ల అమర్ శర్మ (పురాణం), డాక్టర్ 
పెద్ది భరత్ ( సాహిత్యం), బుగ్గారపు నరహరి (నాటక రంగం), గుండి శ్రీనివాస్
 (కవిత్వం), పాలెపు లక్ష్మీ నరహరి (జ్యోతిషం), బుగ్గారపు రాజేంద్రప్రసాద్, ( పంచాంగ కర్త) లను ఈఓ శ్రీనివాస్, చైర్మన్ జక్కు రవీందర్, ధర్మ కర్తలు, ఘనంగా సన్మానించారు.IMG-20250330-WA0224

Tags: